GAMMUNUNDARADA by NELLIKERA VIJAYKUMAR Telugu book cover

GAMMUNUNDARADA

by NELLIKERA VIJAYKUMAR

₹100
In stock · 5 available
PublisherNELLIKERA VIJAYAKUMAR
LanguageTelugu
గమ్మునుండటమంటే ? నేను ఏదీ చేయటం లేదు, అంతా తానంతట తానే నడస్తోంది అనే మనఃస్థితి. అంటే ఎటువంటి క్రియను చేసినా చేయనట్టు ఉండటమే! ఇది క్రియలో నిష్క్రియను, నిష్క్రియలో క్రియను చూచే అపూర్వ స్థితి. నేను అన్నింటినీ చేస్తున్నాను అనే మనోభావం మీదయితే... జీవితం చేయటమనే క్రియాజాలంలో చిక్కుకు పోతుంది. క్రియతో వెలువడే ఫలితాలకు గులాము కావలసి వస్తుంది. అయితే... క్రియ సంభవించింది అనే మనోభావం మీదయినప్పుడు మీరు అక్షరశః సాక్షి అవుతారు. ఫలితం ఏదైనా కానీయండి. అది సరియైనదే అనే నిర్లిప్తత వృద్ధి కావటం మొదలవుతుంది. అప్పుడే జీవితం కర్మ సంకెళ్ల నుంచి విడుదల పొంది తాను నిజంగా చేరవలసిన వ్యవస్థవైపు అడుగులు వేస్తుంది. ఇదే గమ్మున ఉండేందుకు అర్ధాత్ నైష్కర్మ స్థితి. నైష్కర్మ కళను ఈ ప్రపంచానికి భారతీయ రుషులు అందించిన అపూర్వ కానుక. ఆధునిక యుగానికి చెందిన మనందరికీ అత్యవసరంగా మరోమారు పరిచయం చేయవలసిన అద్భుత విజ్ఞానం. ప్రస్తుతం ఈ చిన్న పుస్తకంలో నైష్కర్మ కళ గురించి వివరించేందుకు ఒక చిన్న ప్రయత్నం నాది. ఏమీ తెలియని ఒక వ్యక్తి, ఏమీ తెలియని ఒక కళ గురించి ప్రస్తుత పరిచిన నివేదన. ఇదే ఈ రచన వైశిష్ట్యత.