
GAMYAM
by GANNAVARAPU NARASIMHA MURTHY
₹130
In stock · 271 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
GAMYAM (Katha Samputi) by Gannavarapu Narasimha Murthy నదికి తన గమ్యం తెలియకపోయినా, అది తన గమనాన్ని ఆపకుండా సముద్రం వైపు సాగిపోతుందనీ, అలాగే ప్రతిమనిషీ తన గమ్యం వైపు ఎన్ని కష్టాలు, సమస్యలు వచ్చినా సాగిపోవాలనీ 'గమ్యం' కథ చెబుతుంది. జీవితం అన్నది పూలపాన్పు కాదనీ, కష్టాల కడలి అనీ, అయినా మొక్కవోని ధైర్యంతో దానిని ఎదురీదాలని ఈ కథ సారాంశం. మనిషికి నిరాశ పనికిరాదు, ఆశాజ్యోతి చీకట్లను పారద్రోలుతుంది. ఈ కథా సంపుటిలోని 22 కథలు మనుషుల సమగ్ర జీవనయానాన్ని ఆవిష్కరిస్తాయి. సమస్యల్ని ఎలా ఎదుర్కొని ముందుకు సాగాలో చెప్పకనే చెబుతాయి. మనుషులు నిజాయితీగా బ్రతకాలనీ, నైతిక విలువలు పాటించాలనీ నిర్దేశిస్తాయి... ఇందులోని ఒక కథలో చెప్పినట్లు "అందమైన పచ్చని లోయని చూడాలంటే ఎత్తైన కొండని ఎక్కక తప్పదు”. అందుకే ఈ కథలన్నీ చదవాలి. చివరిగా వాగర్థావివ సంపృక్తా వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ॥ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004