GAMYAM DHISAGA GAMANAM by ALURI BHUJANGARAO Telugu book cover

GAMYAM DHISAGA GAMANAM

by ALURI BHUJANGARAO

₹30
In stock · 3 available
PublisherRAHUL SAHITYA SADANAM
LanguageTelugu
దైవభక్తుల్ని ఎలాంటి పరిస్థితిలోనూ నమ్మకండి, వాళ్ళకు సామాజిక ఆచరణ తాలూకు అవగాహన వుండదు. వాళ్ళు ఆచరణకు దూరంగా, ఫలితాన్ని అనుభవించడానికి దగ్గరగా వుంటారు. అన్నింటికంటే ఘోరమైన, దారుణమైన విషయం - కోట్లాది మానవుల శ్రమఫలితమైన సామాజిక ఉత్పత్తుల శ్రేయాన్ని, అదృష్ట - అగోచర -కల్పిత - లేని - భగవంతుడికి అంటగట్టి, మానవుల్ని హీనుల్ని, దీనుల్ని, బానిసల్ని చేసేస్తారు ! సమాజంలో - మానవ శ్రమ దోపిడీకి మూలమైన అనేక కారణాల్లో - దైవభావన ఓ ప్రముఖ కారణం అనవచ్చును. శరీర శ్రమ ద్వారా బ్రతుకులీడుస్తూన్న కోట్లాది మానవులు పై వర్గాల ద్వారా కల్పించబడిన దైవభావన అనే మోహజాలంలో, మోసపూరిత మాటల్లో చిక్కుకుని - నిరంతరాయంగా, తరతరాలుగా మోసపోతున్నారు! ఇలా ప్రజల్ని - శ్రమజీవుల్ని మోసగించడంలో అన్ని మతాలూ సమానంగా భాగస్వాములవుతూన్నాయి ! ఏ మతమూ గర్వపడవల్సింది ఏమీ లేదు.