GAMYANNI NIRDESINCHUKO by MACHARLA RADHA KRISHNA MURTHY Telugu book cover

GAMYANNI NIRDESINCHUKO

by MACHARLA RADHA KRISHNA MURTHY

₹100
In stock · 9 available
PublisherMACHARLA RADHA KRISHNA MURTHY
LanguageTelugu
లక్ష్యానికి సంకల్పం జోడించాలి మా గురువుగారు శ్రీ ఎం. ఆర్. కె. మూర్తిగారు రచించిన "గమ్యాన్ని నిర్దేశించుకో" అను పుస్తకంపై నా అభిప్రాయం వ్రాసే అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి నా ధన్యవాదములు. "గమ్యాన్ని నిర్దేశించుకో” అనే పుస్తకంలో ఏడు అధ్యాయాలు ఉన్నవి. మనిషి ఎదుగుదలకు లక్ష్యం ఎంత ముఖ్యమో సాధన కూడా అంత ముఖ్యమే అన్న విషయాన్ని రచియిత సరళమైన భాషలో సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో పదజాలాలను ఒక పూలమాలగా కూర్చి పూలమాల అందాలను చూడమని అందులో ఉన్న పూలసొగసులను చూసి, పరిమళాలను ఆస్వాదించి, ఆనందించమని మనకు చెప్పకనే చెప్పి యున్నారు. లక్ష్యం ఒక్కటే సరిపోదు. దానికి కార్యరూపం తోడుగా ఉండా లని కుండ బద్దలు కొట్టినట్లుగా మా మాష్టారు గారు మూడవ అధ్యాయంలో సవివరంగా తెలియపరిచి ఉన్నారు. లక్ష్య సాధనలో అపజయాలను ఎలా ఎదిరించాలో, ఎదిరించగల శక్తి ఎలా పొందాలో కూడా వివరించి యున్నారు. ఈ పుస్తకానికి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఉత్తేజ పరచగల శక్తి ఇమిడి ఉన్నది. మా మాష్టారు గారు తన అపారమైన అనుభవముతో, మేధాశక్తితో ద్వాపరయుగం నుంచి కలియుగం వరకు, వివిధ వ్యక్తుల వ్యక్తిత్వాన్ని మన ముందు ఉంచుతూ మనలో ఉన్న పిరికితనాన్ని, అలసత్వాన్ని, నిరాశను, నిస్పృహను ఎలా తరిమి కొట్టాలో చెప్పి ఉన్నారు. ఏడవ అధ్యాయంలో ధీరూభాయి అంబానీ, గ్రంధి సుబ్బారావు, స్వీట్ పుల్లారెడ్డి, తిరుమల బ్రహ్మ నాయుడు, జక్కా నాగభూషణం ఎలా అభివృద్ధి