
GANAPATHYUPANISHAT
₹125
In stock · 6 available
PublisherDR.ARIPIRALA VISWAM
LanguageTelugu
"ముందుమాట విశ్వ మానవ ధర్మం సనాతన ధర్మం, సృష్టికి మిగిలే ఒకే ఒక ధర్మం. మతాలన్నింటికి విశ్వాసాలన్నింటికి జనని. దేవునికి, జీవునికి స్వ, పర, సజాతీయ, విజాతీయ భేదభావాన్ని వాడినివేసిన అచ్చమైన దివ్య ధర్మం. సనాతన ధర్మం ఆత్మ, పరమాత్మల ఐక్యాన్ని తప్ప మరే శరభావాన్ని గుర్తించని మహిమాన్విత ధర్మం. అది ఋషీ ధర్మం. పేరులేని ఆత్మధర్మం నిర్నామ పరమాత్మ ధర్మం. ఉపనిషత్తులు, వేదాలు బ్రహ్మ విద్యా సహస్యాన్ని శ్రీ విద్యాపరంగా చెప్పటానికి, నేర్పటానికి పుట్టాయి. చీకటికి ఆవల చీకటి, తేజస్సు వెనుక తేజస్సు లోకాలోకములు కావల ఉన్నది పరా. ఇదే సనాతనం అవ్యక్తం అనాది, ఆది. ఆదిమధ్యాంతాలకు మూలకారణం అదే పరమాత్మ నిన్నామం, నిరీశ్వరం. infinite void అందులోని ఆత్మ అంశ. నా ఆత్మ. ఇది ఎరగలేకపోవటం ఆవిద్య ఎరుగుట విద్య. ప్రస్తుత ఈ గణపతోపనిషత్, ఏకాక్షర ఉపనిషత్, ఆత్మోపనిషత్ మరియు శ్రీకృష్ణోపనిషత్, శ్రీ విద్యవరంగా విశదపరచటం, సరళభాషలో చెప్పడం జరిగింది. ఈ ఉపనిషత్తు మొడితార్థం, ఈశ్వర కామనేమే పరమేశ్వరి శివశక్తి స్వరూపం, వారి 'కామనమే ఈ శ్రీచక్ర ఆవిర్భావం. శ్రీచక్రం గణేశుడు దాని అంతర్ శక్తి సుబ్రహ్మణ్యుడు. సంపూర్ణంగా ఇది శ్రీ చక్రం మరియు శ్రీచక్ర దర్శనం. పరతత్వపరంగా ఈ గణేశ, ఏకాక్షర, ఆత్మ మరియు శ్రీకృష్ణోపనిషత్లు హృద్యంగా చెప్పడం జరిగింది. ఇది వరకు ఉపనిషత్లు జరిగిన వ్యాఖ్యానాలు అన్ని ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత పరంగానే ఉన్నాయి. నిజానికి ఇది పాక్షిక దృష్టి మాత్రమే. ఉపనిషత్తులు, వేదాలు బ్రహ్మ విద్య రహస్యాన్ని శ్రీవిద్యాపరంగా చెప్పటానికి, నేర్పటానికి పుట్టాయి. 112 ఉపనిషత్లు శ్రీవిద్యాపరంగా వేసిన ఈ ఆనంద ఘన వ్యాఖ్యమే దానికి సమాధానం. ఈ ఉపనిషత్తులలో దాదాపు 11 నుండి 18 వరకు ప్రత్యక్షంగా శ్రీవిద్యాపరంగా ఉన్న ఉపనిషత్తులు. మిగిలినవన్నీ పరోక్షంగా శ్రీవిద్యా మహత్యాన్ని వర్ణించిన ఉపనిషత్తులు. పరంపరా, చరిత్రలో నేడొక శుభదినం. నాలుగు ఉపనిషత్లు గణేశ, ఏకాక్షర, ఆత్మ మరియు శ్రీకృష్ణోపనిషత్తులు వ్యాఖ్యతో సహా ఈ గ్రంథంలో చోటు చేసుకున్నాయి. సనాతన ధర్మం పైన విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు ఈ గ్రంథాన్ని చదవవచ్చు. విశ్వాసం లేని వారు కూడా ఈ గ్రంథాలని చదివి తర్కించి, చర్చించవచ్చు తరించవచ్చు. మేము చేస్తున్న లోక కళ్యాణ యజ్ఞం వదాన్యులు ఎవరైన మిగిలిన ఉపనిషత్తులు గ్రంథరూపంలో తీసుకొనిరావడానికి సహాయపడగలరు. ఇది ఆహ్వానం, వ్యక్తులైన, సంస్థలైన ఇది మీ బాధ్యత అని భావిస్తే ముందుకు రండి. యజ్ఞంలో పాల్గొనండి. ఈ గ్రంథాలను జోకానికి అందించిన వారి వంశానికి శ్రీపరాభారతి, లలితాభట్టారిక యొక్క ఆశీర్వచనము మరియు సుహృన్మణులు. నవభారత్ ప్రింటర్స్ యాజమానులు శ్రీ ఎన్. వెంకటేశ్వరరావు వారికి నమస్మృతులు మరియు శ్రీ గురు పరంపర ఆశీర్వచనములు. గణేశ, ఏకాక్షర, ఆత్మ మరియు శ్రీ కృష్ణోపనిషత్తులు మీ పాలిట సాధన సాఫల్య కల్ప తరువు.