
GANDHAM YAAGNAVALKYASHARMA KATHALU
₹175
In stock · 41 available
PublisherGANDHAM YAAGNAVALKYASHARMA
LanguageTelugu
అదిలాబాదు శాలువా హైదరాబాదు బదిలీ అయి వచ్చిన మరునాడే విశ్వంవాళ్ళ ఆఫీసుకు వెళ్ళాను. నేను గత మూడు దశాబ్దాలుగా మిత్రులం. ఓపెద్ద వ్యాపార సంస్థ నడిపే చాలా విక్రమలలో ఒకటైన, సచిత్ర వారపత్రికకు 'డిప్యూటి ఎడిటర్' విశ్వం. గత ఇరవయి అయిదు సంవత్సరాలుగా హైదరాబాద్లోనే వుండి పోయాడు. మాత్రం ప్రభుత్వం వారిచేతిలో, విసిరివేయబడే గులక రాయిలా, అటు నుండి ఇటు, ఇయి నుండి అటు విసరబడుతూ మరలా, పది సంవత్సరాల తరువాత హైదరాబాదు చేరాను. నేను వెళ్ళేపాటికి విశ్వం చాంబర్సులో మరో వ్వక్తి వున్నారు. నన్ను చూస్తూనే 'రా' అంటూ ఎదురొచ్చి తీసికొనివెళ్ళి కూర్చోవటానికి కుర్చీచూపించి "నిన్న రెండుసార్లు ఫోను చేశాను ఓసారి ఇపుడే చార్జితీసుకొని 'కమీషనర్ని' చూడటానికి వెళ్ళావన్నారు. మరోసారి ంచ్ కి వెళ్ళావన్నారు-" అన్నాడు. ఆ మూడవ వ్యక్తిని విస్మరించామా అన్నట్టు మామధ్య కుశల ప్రశ్నలతో ప్రారంభమైన సంభాషణ, పిచ్చాపాటిలోనికి, ఆపై గత స్మృతులలోకి మారి పోనున్న తరుణంలో "సో! విశ్వం..... మరోసారి కలుస్తాను" అంటూ లేచాడాయన. "అయాం సారి! మిమ్మల్ని పరిచయం చేయలేదు కదూ.! 'దిస్ ఈజ్ మిస్టర్సం పత్' డిప్యూటి రిజిష్ట్రారు సహకారశాఖలో అంతేకాదు... గొప్ప సాహిత్యాభిమాని అంటూ నన్ను పరిచయంచేసి నాకేసి తిరిగి "వీరు... రాఘవ... సుప్రసిద్ధ కవులు. నీకు తెలిసే వుంటుంది. ఈ సంవత్సరం వీరి 'అలజడి' అనే కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ వారి అవార్డు వచ్చింది.” అన్నాడు విశ్వం. ఒకరికొకరు నమస్కరించుకొన్నాం! ఆయనగారి కవితలు చదివిన గుర్తొచ్చింది. 'అకాడమీ అవార్డు వచ్చిన సందర్భంగా ఈమధ్యనే 'రాఘవ'కు అదిలాబాదులో సన్మానం జరిగింది. ఆనాటి సన్మానసభా విశేషాలు ప్రెస్లో వచ్చాయి, చూచే వుంటావు" అన్నాడు విశ్వం. "మీ కవితలు చదివాను. మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషంగా వుంది." అన్నాను రాఘవతో.