
GANDHARI VANA
by ANIL DYANI
₹100
In stock · 3 available
PublisherHORU PRACHURANALU
LanguageTelugu
ISBN9788195700776
రోజూ కొన్ని వందల వాక్యాలు పోగుపడిపోతూనే వున్నాయి. అంతుపట్టని A matrixలోకి దారం తెగిపోయిన అనాథ పదాల బిక్కు ముఖం కవిది. అయితే, వీటన్నీటి మధ్యా అనిల్ ని వెతుక్కోవడం అంత కష్టమేమీ కాదు. నిక్కచ్చిగా నిజాయితీగా మోగే గొంతుక. తడబాటు తెలియని ఆకలి వేళ్ళ అన్వేషణ. ఎన్నాళ్లుగా తెలుసు మనకి ఈ అనిల్ భాష!? ఇన్నేళ్ల వాక్యసాహచర్యంలో ఎప్పుడైనా అనిల్ వాక్యం గురితప్పిందా?! నాకు తెలిసీ- లేదు, ముమ్మాటికీ లేదు! గురితప్పితే అది అనిల్ వాక్యం అవ్వదు. పదాల మధ్య సాంద్రమైన జనసంద్రాల్ని పొదిగే నేర్పరి అనిల్. అందుకే, అనిల్ కవిత్వాన్ని పదాలతో కొలవడం కష్టం! అనిల్ వాక్యాలన్నీ శిధిలమైన హేమంత పత్రాల్ని కుప్పపోసి, నిప్పంటించే సమిధలు. చలికాలపు నడిరాతిరి వొంటిని చుట్టుముట్టే నెగళ్ళు. అనిల్ వాక్యాల వెంట నడవడం కేవలం "చదవడం" కాదు, వొక్కో నిప్పు అలనీ కౌగిలించుకోవడం! శరీరాన్నీ, గుండెనీ అగ్నిపరీక్షకి సిద్దం చేయడం! – అఫ్సర్ తీరని కలల వలపోత ఏదో తన కథను మూలం నుంచి చెప్పమన్నట్టుంది ఈ కవిని. చరిత్రేమో ఎప్పుటికప్పుడు పీఠభూముల కింద కప్పబడిపోతూఉంది. ఇక సగటు సంఘర్షణల లెక్కల్లో తలసరి వేదన ఏమని కొలవగలం!? ఈ కవికి.. ఇంకిపోయిన గుండె చెలమకు తడిని అద్దుకోవాలన్న సామూహిక పాఠం నేర్చుకోవాల్సిన అవసరమూ తెలుసు.. తెగిపోయిన మూలవాసుల కంఠాల సామాజిక స్వప్నాలకు జత కళ్ళను ధారాదత్తం చేయడమూ తెలుసును. కనుకే, పాత కలలను కొత్త ఉపమల వృత్తంలో విచికిత్స చేసిందీ కవిత్వం. సమాజం చేతిలోని ఉలి పదేపదే గాయ పరుస్తున్నా, ఓర్చి నిలిచే శిల మోములోని కళాత్మక దరహాసం ఈ కవిత్వం. కవికి గల వ్యుత్పత్తి అభ్యాసాల మేలు కలయిక వల్ల అబ్బిందే ఈ ఈస్థటిక్ సెన్స్. అయితే ఆ సౌందర్యం ఊహల కోసం అద్దిన మెరుపు కాదు. అందులోని వాస్తవం ఇతను చెప్పాలనుకున్న వాస్తవాల్లోని చేదును మరింత చిక్కగా చూపింది. 'నేను నుంచి మేము, మనం అవడానికే ఏ రచన అయినా' అని "బతికిన క్షణాలు” లో 'మో' అన్నట్టు.. 'పక్కవాడికి దూరమై మనకి మనం దగ్గర కావడం అంటే మనిషొక సమూహమని గుర్తు చేయడం తెలిసిన వాడిగా నీ కోసం.. నీతో.. నీకై తపించే మనిషి చెప్పే ఈ ఒక్క మాట వింటావా?' అని ఈ కవి అడుగుతున్నాడు. -ఫణి మాధవి కన్నోజు