GANDHEYA VILUVALLO NAITIKATA MANAVATA by KODURI SRIRAMA MURTHY Telugu book cover

GANDHEYA VILUVALLO NAITIKATA MANAVATA

by KODURI SRIRAMA MURTHY

₹150
In stock · 241 available
PublisherKODURI SRIRAMA MURTHY
LanguageTelugu
రెండు మాటలు -మహాత్ముని గురించి నేను పలు గ్రంథాలు రాసినప్పటికీ, నాకు చాలాకాలం నుంచి - ఆయన నైతిక విలువల గురించి, మానవతా దృష్టి గురించి, ఒక పుస్తకం రాయాలనే కోరిక వుండిపోయింది. ఆ కోరికను తీర్చుకోడానికే నేను ఈ పుస్తకం రాశాను. నేడు సమాజంలో - నైతిక విలువలు అనేవి, మానవతా దృక్పథం అనేది, అన్ని స్థాయిలలోనూ మృగ్యమైపోయాయి. ధన సంపాదనే ప్రధాన లక్ష్యంగా వుంటున్నది. మహాత్ముని కాలంలోనూ ఈ పరిస్థితి కొంతవరకూ వున్నప్పటికీ, స్వరాజ్యం వస్తే, ఇవన్నీ తొలగిపోతాయని ఆయన ఆశించారు. ఆయన జీవితకాలంలోనే స్వరాజ్యం లభించింది. కాని, ఆయన కోరుకున్న రీతిలో రాలేదు. సమాజంలోని వికృతులు తగ్గలేదు సరికదా - పెరిగిపోయాయి. ఇది ఆయనను చాలా బాధించింది. తమ స్వార్ధం చూచుకునేవారే కాని, ఇతరుల సంక్షేమాన్ని గురించి ఆలోచించేవారు తగ్గిపోతూ వచ్చారు. ఆయన సలహాలను విన్నట్టు నటించేవారే గాని, నిజాయితీతో, దానిని ఆచరణలోనికి పెట్టేవారు కరువైపోయారు. ఈ పరిస్థితులకు తోడుగా, మత విద్వేషం విజృంభించింది. ఇదంతా చూసి, ఆయన నిరాశతో "నేను ఒక ఖర్చుపెట్టేసిన బులెట్ని-” అని పలు సందర్భాలలో వాపోయేవారు. కాని, - మహాత్ముడు ఆశాజీవి. నిరాశావాది కాడు. ఈ చీకటి శాశ్వితంగా రాజ్యమేలుతుందని ఆయన భావించలేదు. అదే ఆయనలోని ప్రత్యేకత. ఒక విదేశీ రాయబారి గాంధీజీని ఇంటర్వ్యూ చేస్తూ, దేశంలోని ఆనాటి పరిస్థితుల ప్రస్తావన తెస్తే -