GANDHEYAM by DR.VAVILALA SUBBARAO Telugu book cover

GANDHEYAM

by DR.VAVILALA SUBBARAO

₹100
In stock · 5 available
PublisherDR.VAVILALA SUBBARAO
LanguageTelugu
ఈ పుస్తకం ఎందుకంటే ! గాంధీగారిని తలచుకుంటే నా బాల్యం జ్ఞాపకం వస్తుంది. నేటికీ ఆయనపై ప్రేమ వదలదు. గాంధీజీహత్య మారుమూలనున్న పల్లెటూళ్లను గూడ ఏడిపించింది. అప్పటికి మా అమరావతి పల్లెటూరే. ఊరుమొత్తానికి ఒకటే రేడియో. అది పంచాయితీ ఆఫీసువారిది. ఉదయం 8గం|| వరకు మ్రోగేది. అది వినిపించే వార్తలే ఊరుమొత్తానికి. ఒకరిద్దరికి సొంత రేడియోలున్నా యేమో! మానాన్నగారికి ఉదయాన్నే అక్కడకు వెళ్లి కాగితం మీద ముఖ్య వార్తలు వ్రాసుకొనే అలవాటు. ఆ రాత్రివార్తలు విన్న వాళ్లందరు గాంధీజీ మరణవార్తను తమకు తెలిసిన వాళ్లందరికి చెప్పారు. వీధి దీపాలుగూడ లేని ఆ రాత్రుళ్లలో వీధుల్లో గుంపులు గుంపులుగా చేరి మాట్లాడుకున్నారు. మర్నాడు ఉదయాన 9 గంటలకల్లా కన్నీళ్లతో కృష్ణాస్నానానికి వచ్చారు. మహాపురుషుల మరణవార్తవింటే అందరూ స్నానాలు చేస్తారు -ఆత్మ బంధువులాగ భావించి. ఆ పూట ఎవరూ అన్నాలు వొండుకు తినలేదు. పిల్లలకుమాత్రం వొండి పెట్టారు. పెద్దవాళ్లంతా ఉపవాసమే. సాయంత్రం చీకటిపడ్డ తర్వాత గాంధీజీ దేహానికి అంతిమ సంస్కారాలయ్యాక మళ్లీ స్నానాలు- అపుడు వొండుకుతిన్నారు ఇళ్లల్లో. నాకు అపుడు ఏడు సంవత్సరాలు. ఏమి తెలియకపోయినా తోటిపిల్లలుగూడ ఎందుకో దుఃఖంగా ఉన్నారు. తమయింటి పెద్ద మరణించినట్లే ప్రతికుటుంబం బాధపడ్డది. ఎవరేమన్నా అననీ ఆయన జాతిపితే! ఎంతో చేసినా, పోయిన తండ్రిని మాత్రం ఎంత కాలం గుర్తుంచుకుంటాం! గాంధీజీని అంతే. మహాత్మా! జాతిపిత! అన్న పరమగౌరవం ఒకవైపు, తుపాకితో కాల్చి చంపాలన్నంత పరమ అసహనం మరొకవైపు, ఒకేవ్యక్తిపై ఉన్నాయంటేనూ, చంపి 70 ఏళ్లయినా ఇప్పటికీ ఉభయ తీవ్రతలు కొందరిలోనయినా కొనసాగుతున్నాయంటేనూ నిశ్చయంగా ఆయన మహా గొప్పవాడే.