
GANDHI ANTARANIJATHULA VIMUKTHI
₹20
In stock · 2 available
PublisherSAMANTARA FOUNDATION
LanguageTelugu
ముందుమాట 'ఇన్స్ట్యూట్ ఆఫ్ పసిఫిక్ రిలేషన్స్' భారత విభాగపు అధ్యక్షుడి ఆహ్వానం మేరకు గత సంవత్సరం ఆగస్టులో భారతదేశంలోని అంటరాని వారి సమస్య గురించి ఒక పత్రం వ్రాసాను. ఇది 1942లో కెనడాలోని క్యూబెక్లోలో జరిగే వారి సమావేశాల్లో ప్రవేశపెట్టడం కొరకు రాయబడింది. ఈ పత్రం ఆ సమావేశపు వివరాలలో ప్రచురితమైంది. ఇది తెలిసినప్పటి నుండి భారతదేశంలోని అంటరానివారి నాయకులు అమెరికా మిత్రులు ఈ సమస్య పట్ల ఉత్సుకత వున్నవారు దీన్ని విడిగా ప్రచురితం చేయమని ఒక పుస్తకం రూపంలో సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెమ్మని అడుగుతూ వున్నారు. వారి విజ్ఞప్తిని నిరాకరించడం సాధ్యంకాలేదు. అదే సమయంలో సమావేశపు వివరాలు బయటి ప్రపంచం కోసం ప్రచురితం అయ్యేవరకు ఈ పత్రాన్ని బయటి ప్రపంచానికి ప్రకటించడం సభా సంస్కారం కాదనిపించింది. పసిఫిక్ సంబంధాల సమావేశం కార్యదర్శి సమావేశపు విషయాలు ప్రజలకు అందుబాటులోనికి వచ్చాయని ఒక వేళ నేను ఈ పత్రాన్ని విడిగా ప్రచురితం చేయదలిస్తే వారికి అభ్యంతరం ఉండదని తెలియజేసారు. ఈ పత్రాన్ని ప్రకటించడానికి పది నెలలు ఆలస్యం కావడానికి కారణం యిదే. కొన్ని అక్షర దోషాలు తప్ప ఈ పత్రం ఆ సమావేశంలో ప్రకటించినదానికి యథాతధంగా వుంది. పత్రంలోని విషయాల గురుంచి పూర్తిగా పత్రమే చెబుతుంది. నేను చెప్పదలుచుకొన్నది ఒకటే. సమావేశం ప్రధానంగా అంగీకరించిన విషయాలలో మానవతా విలువల మేరకు సమావేశం ఎదుర్కోవలసిన మూడు సమస్యలు 1. సామ్రాజ్యవాదం 2. జాతివివక్షత 3. తెగవివక్ష 4. వ్యాపారం పేరుతో మనుష్యుల రవాణా. యివన్నీ కూడా జాతిపట్ల జాతి క్రూరత్వానికి, మనిషి పట్ల మనిషి అమానవీయ ప్రదర్శనకు నిలువెత్తు అద్దాలుగా దాపురించిన వినాశ గ్రంధులు. ఈ సమస్యలన్ని మనం తక్షణం సరిదిద్దుకోవలసినవే.