GANDHI JAYANTHI NATAKAM-45 by D.VIJAYA BHASKAR Telugu book cover

GANDHI JAYANTHI NATAKAM-45

by D.VIJAYA BHASKAR

₹45
In stock · 34 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మనసులోని మాట... ప్రతి రచన పుట్టుక వెనుక ఒక కథ ఉంటుంది. అలాగే ఈ నాటకం/వాటికల వెనక గమ్మత్తయిన కథలున్నాయి. 2000 నంది అవార్డుల ఫంక్షన్ విజయవాడలో జరిగింది. ఆ ఫంక్షన్కి నేను నూతన్ ప్రసాద్ అన్నగారు, విజయ ప్రకాష్ గారు ముగ్గురం కలిసివెళ్ళాం. రిస్తున్నప్పుడు పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నాం. ఉన్నట్టుండి తమ్ముడూ! తర్వాత నాటకం రాస్తున్నావని అడిగారు అన్నగారు. నేనొక సబ్జెక్ట్ చెప్పాను. అన్నగారు మరొకటి చెప్పారు. ఇలా ఎన్నో విషయాలు దొర్లాయి. అవేవీ బాగా అన్పించలేదు. బుద్ధుడు, సోక్రటీసులాంటి వారిమీద నాటకాలు రాయాలని నాకు బలమైన కోరిక అనిజెప్పాను. అయితే గాంధీ మీద వ్రాయమని అన్నారు అన్నగారు. అంటూనే కొన్ని సీన్స్ చెప్పారు. వాటిమీద చర్చించి మంచి చెడులు నిర్ణయించుకున్నాం. ఆ చర్చ నన్ను ఎంతగా ప్రభావితం చేసిందంటే వస్తూనే నాటకం వ్రాయడం ప్రారంభించాను. ఓ పదిహేనురోజుల్లో నాటకం పూర్తి చెయ్యాలనుకున్నాను. కానీ ఏ రోజుకారోజు నేను నాటకం రాసింది రాసినట్టు నా శ్రీమతికి, మరో మిత్రురాలికి వినిపించాను. వారిచ్చిన ప్రోత్సాహంతో వారం రోజుల్లోనే నాటకం పూర్తయిపోయింది. వారిద్దరికీ నా కృతజ్ఞతలు. నేను హైస్కూల్లో చదివే రోజుల్లో గాంధీ వర్ధంతినాడు ఒక పత్రికలో ఆయన్ని గాడ్చే ఎలా చంపాడో వివరిస్తూ ఓ వ్యాసం పడింది. అది చదివి బాగా ఏడ్చాను. గాంధీని సంకెళ్ళతో కోర్టుకు తీసుకువచ్చే సీను వ్రాసినప్పుడు మళ్ళీ అంతగా ఏడుపొచ్చింది. మానవ చరిత్రలో మర్చిపోలేని అద్భుతమైన వ్యక్తి గాంధీ. ఇలాంటి వ్యక్తి ఒకరు ఈభూమ్మీద బ్రతికారు అని చెబితే రాబోయే తరాలవారు నమ్మరట. అటువంటి వ్యక్తిని పాత్రగా వ్రాయడం ఓ గొప్ప అనుభూతి- ఆ అనుభూతిని మనసారా అనుభవించిన అదృష్టవంతుడ్ని నేను. నాటకాన్ని శ్రీ రమణమూర్తిగారికి వినిపించిన తర్వాత అతన్ని తీసుకెళ్ళి లంగర్ హౌస్లోని బాపూఘాట్ చూపించాను. దాని దుస్థితి చెప్పనలవికాదు. రాష్ట్ర గవర్నర్ డా॥ సి. రంగరాజన్ గారి చొరవ వలన ప్రభుత్వం దాన్ని ఈ మధ్య చాలా సుందరంగా తీర్చిదిద్దింది. ఇదంతా ఎందుకంటే లంగర్హౌస్లో ఉన్నట్టే రమణమూర్తిగారు చాలా భారీ సెట్టు వేసి నాటకాన్ని ప్రదర్శించేరు. 2002 సం॥లో జరిగిన నంది పోటీల్లో ఈ నాటకానికి ఐదు నందులు వచ్చాయి. ఒకరోజు నేనూ, మా ఆవిడ టి.వి. చూస్తున్నాం. రిమోట్ మా ఆవిడ చేతిలో ఉంది. ఎవరో రావడంతో Sound mute చేసి, వాళ్ళతో మాట్లాడి పంపించేశాం. T.V. కి సౌండివ్వబోతూ... ఇప్పుడు వాళ్ళేం మాట్లాడుకున్నారో చెప్పుకోచూద్దామంది మా ఆవిడ. స్సరే నేనేదో చెప్పాను.