GANDHI SATHAKAMU by LAKSHMIPATHI APPARAO Telugu book cover

GANDHI SATHAKAMU

by LAKSHMIPATHI APPARAO

₹20
In stock · 7 available
PublisherLAKSHMIPATHI APPARAO
LanguageTelugu
గాంధేయవాది - మా నాన్నగారు మా స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా, దెందులూరు గ్రామం. మా తల్లిదండ్రులు లక్ష్మీపతి అప్పారావు గారు, శ్రీమతి సరోజిని గారు, మా తాతగారు నాయనమ్మ గారు లక్ష్మీపతి మహంకాళి, అచ్చమ్మ పుణ్య దంపతులు. మా నాన్నగారి బాల్యవిద్యాభ్యాసాలు మా దెందులూరులోనే కొనసాగాయి. దెందులూరులోనే హిందీ "విశారద" వరకు అభ్యసించారు. తెనాలిలో హిందీ “రాష్ట్రభాషా ప్రవీణ" "ప్రచారక్" ట్రైనింగు పూర్తి కావించారు. అనంతరం పశ్చిమగోదావరి జిల్లాలోని అనేక ఉన్నత పాఠశాలల్లో "గ్రేడ్ 1 హిందీ పండితుని" గా సేవలందించి 1990లో పదవీ విరమణ చేశారు. ఆయన హిందీ సాహిత్యం చదువుకొనే రోజుల్లోనే జాతిపిత గాంధీజీ సత్యం అహింస త్యాగాల పట్ల ప్రభావితులైనారు. అంతేగాక గాంధీజీ నిరుపమాన సేవాతత్పరతను గురించి బాల బాలికలకు బోధించారు. ఉద్యోగ విరమణ చేసిన నాటినుండి సార్వజనీనమైన, సార్వకాలికమైన గాంధీజీ సిద్ధాంతాలను ప్రజల గుండెలలో నాటి, అవి చిరకాలం నిలచి ఉండేలా చేయాలని సంకల్పించారు. (బాల్యంలోనే అనేక శతకాలను కంఠస్థం కావించిన వారు కావడం వల్ల వారి దృష్టి శతక ప్రక్రియ మీద ప్రసరించింది.) సంస్కృతంలోనూ కొంత ప్రవేశం ఉండుట వల్ల హిందీ భాషా పండితులైప్పటికీ తెలుగు ప్రజలకు తేట తెలుగులో గాంధీ మహాత్ముని భావజాలాన్ని అందించాలని అనుకొన్నారు. ఆ సంకల్పానికి సాకారమే ఈ "గాంధీ శతకము". సాధ్యమైనంత వరకు తేట తెలుగు పలుకుబడితో తేటగీతి ఛందస్సులో పద్యరచన చేశారు. ఈ "గాంధీ శతకము" ఇంత అందంగా వెలువడడానికి ప్రసిద్ధకవి డాక్టర్ జంధ్యాల మహతీశంకర్ గారు ఎంతో అండగా నిలిచారు. వారికి మా కృతజ్ఞత.