GANDHIJI HATYA VENUKA by KALIDINDI BHIMARAJU Telugu book cover

GANDHIJI HATYA VENUKA

by KALIDINDI BHIMARAJU

₹100
In stock · 18 available
PublisherKALIDINDI BHIMARAJU
LanguageTelugu
గాంధీజీ హత్యవెనుక... ముందుమాట 1947 ఆగష్టు 15 స్వాతంత్య్రం వచ్చిన సంగతి అందరికి తెలుసు. సత్యం, అహింస రాజకీయ ఆయుధాలుగా తయారుచేసి మహాత్ముడు స్వతంత్రము సాధించిన చరిత్ర అపురూపం. చరిత్రలో ఇటువంటి సంఘటన ఎక్కడా కనిపించదు. స్వతంత్రము రాక పూర్వం నుంచి బ్రిటిష్ సామ్రాజ్యవాదం ప్రోత్సాహంతో హిందూ ముస్లిం వేర్పాటు భావాలు తీవ్రరూపం దాల్చి ఉత్తరదేశం అంతా హింసా పూరితమైన పరిస్థితులలో దేశం పాకిస్తాన్, ఇండియాగా విభజించబడి స్వాతంత్య్రం వచ్చింది. స్వతంత్ర పోరాటం చివరి రెండు సంవత్సరాల చరిత్ర గాంధీగారి నాయకత్వానికి చాలా కీలకమైన దశ. ఆ భాగమును ఎంచుకొని స్వతంత్రము వచ్చిన 40 ఏళ్ల తర్వాత డొమినిక్ లెపర్ మరియు లారీ కోలిన్స్ (Daminique lapine and Larry collins) ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ (Freedom at Midnight) అనే గొప్ప పరిశోధనతో కూడిన గ్రంథము వ్రాశారు. దానిలో మనకు తెలియని సత్యములు ఎన్నో ఉన్నవి. గాంధీ హత్యకు జరిగిన కుట్ర ఈ పుస్తకంలో 16 నుంచి 20 అధ్యాయములలో ఉన్నవి. అవి అందరూ తెలుసుకోవలసిన సంగతులు. ఐదు అధ్యాయములలోని అంశాలను సంక్షిప్తంగా తెలుగులోకి సంగ్రహంగా అనువదించి ఈ పుస్తకమును రాసినాను. పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఇది గైడు లాంటిది. చివరగా ఈ పుస్తకంలో రాసిన చరిత్రకు తరువాత భాగం భరత వాక్యం పేరుతో నేను రాసింది. ఆ భాగం నా సొంత రచన. గాంధీజీ హత్య గురించి 20 ఏళ్ల తర్వాత పార్లమెంట్ జె.ఎల్. కపూర్ అనే రిటైర్డు జడ్జిని కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ ఏర్పాటు చేసినది. గాంధీపై జరిగిన కుట్ర, సాక్ష్యాధారాలు, అన్నింటిని సేకరించి కపూర్రు ఆరు వాల్యూముల నివేదిక కూడా పార్లమెంటుకు దఖలు పరిచియున్నారు. జస్టిస్ కపూర్ ప్రభుత్వానికి దాఖలు చేసిన నివేదికలో గాంధీ హత్యకు ప్రధాన కుట్రదారు సావర్కర్ అని సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు.