
GANGARAMAM-299
by PRANAVI
₹299
In stock · 4 available
PublisherVIJAYENDRA CREATIONS
LanguageTelugu
ముందు మాట చిన్న దేశాలైన సింగపూరు, శ్రీలంకల దగ్గర నుండి అగ్ర రాజ్యాలైన అమెరికా, బ్రిటన్ వంటి దేశాల వరకు చూచివస్తే, సకల వనరులు వున్న మనదేశం పాతికేళ్లు వెనకబడి వుందనిపిస్తుంది. ఎప్పుడు మనదేశం యీ దరిద్రాన్ని, దౌర్భాగ్యాన్ని అధిగమించి, సంపన్న దేశంగా మారుతుంది! అనే బాధ మనస్సును తొలుస్తుంది. AST పల్లె సీమలను సందర్శించినందువల్లే గాంధీ మహాత్ముడికి పరిస్థితు లర్థమై, గ్రామ సీమలే భారత దేశపు వెన్నెముకలన్నాడు. వాటిని సమృద్ధి పరిస్తే, దేశం ప్రగతిని సాధిస్తుందని, ఏనాడో ప్రభోదించాడు. ఇప్పటికీ అనేక గ్రామాల స్థితి, గతులు బాధాకరంగానే వున్నాయి. పైగా, కొన్ని కొత్త బాధలు కూడా వచ్చి పడ్డాయి. అవన్నీ మనసులో వుంచుకొని, అగ్రరాజ్యంలోని అభివృద్ధిని ఆలంబనగా చేసుకొని, ఎప్పుడో రాసిన నవలకు కొత్తరూపాన్నిచ్చి పాఠకులకు అందిస్తున్నాను ఇవన్నీ కల్పిత పాత్రలు, కల్పిత సంఘటనలు, కల్పిత సంభాషణలు! ఈ 'గంగారామం' పాఠకులను ఆలోచింపజేస్తే, నా ప్రయత్నం ఫలించినట్లు, కుంబంచాలు, నిరుద్యోగ సమస్య