GANIKA - KATHALU by VIJAYA BHANDARU Telugu book cover

GANIKA - KATHALU

by VIJAYA BHANDARU

₹150
In stock · 1 available
PublisherVIJAYA BHANDARU
LanguageTelugu
నా మాట కవిత్వం, వ్యాసం, కాలమ్, కథ ఏదైనా నా ప్రతి రచనా స్ఫూర్తికి కారణమైన నలుగురి గురించి ముందుగా ప్రస్తావిస్తాను. మొదటి గురువు మా అమ్మ భండారు వరలక్ష్మి. తను గత సంవత్సరం తొంబైఏళ్ల వయసులో నిండు జీవితాన్ని ముగించుకుని మమ్మల్ని విడిచివెళ్లిపోయింది. అమ్మకి తెలుగు భాషతో పాటు హిందీ, సంస్కృత భాషల్లో కూడా ప్రవేశం ఉంది. చిన్నప్పటి నుండి నాకు పురాణ ఇతిహాసాలతో పాటు చిన్నా పెద్ద బాలశిక్షలు, వేమన, సుమతి, దాశరథి శతకాలను కంఠతా పట్టించి, అందులోని నీతిని అర్థం చేయించడంలో ఆమె పాత్ర గొప్పది. పేదరాసి పెద్దమ్మకథలు, పంచతంత్ర కథలు, బేతాళ కథల్లాంటివి చెప్పి మమ్మల్ని నిద్రపుచ్చేది. ఒక్కోసారి ఆమెకు ఏ కథా గుర్తుకు రాకపోతే, కొత్త కథలల్లి మమ్మల్ని ఉత్తేజపరిచేది. తన ద్వారా నేను కూడా మా తమ్ముళ్లకు అమ్మను అనుకరిస్తూ కథలు అల్లిచెప్పడం నేర్చుకున్నాను. పెరుగుతున్న క్రమంలో మా చిన్నమ్మ కూతురు లలితక్కయ్య. తనకు సినిమాలంటే చాలా పిచ్చి. ఎండాకాలం సెలవులప్పుడు అమ్మమ్మ దగ్గరికి వచ్చినప్పుడల్లా మార్నింగో మొదలుపెట్టి మ్యాట్నీ, ఫస్ట్ షో వరకు వరుసబెట్టి మూడు సినిమాలు ఒకేరోజు చూసేది. తనకు తోడుగా నన్ను తీసుకుని వెళ్లడం వల్ల నాలో కొత్త ఉత్సాహం కలిగేది. స్కూలు తెరిచాక తనతో కలిసి చూసిన సినిమాలన్నీ గుర్తుపెట్టుకుని పొల్లుపోకుండా నా స్నేహితులతో పంచుకునేదాన్ని.