
GANITHA PRAPANCHAM
₹49
In stock · 2 available
PublisherKOMMURI RAVI KIRAN
LanguageTelugu
ప్రాచీన గణిత చరిత్ర (వేద, పూర్వ - మధ్య యుగాలు) పాశ్చాత్య చరిత్రకారులు ప్రముఖంగా బాబిలోనియా, ఈజిప్టు, రోము, గ్రీసు గణిత చరిత్రనే వ్రాసారు. అందులో భారతదేశ గణిత శాస్త్ర చరిత్ర “సున్నాకు” మాత్రమే పరిమిత మయింది. మనదేశ గణిత శాస్త్ర చరిత్రలో “సున్నాను” మినహాయిస్తే మిగిలింది "సున్నా” అన్నారు. మనమూ అనుకున్నాము. క్రమక్రమంగా చరిత్రను పరిశోధనాత్మక దృష్టితో పరిశీలించటం ప్రారంభించిన చరిత్రకారులకు సున్నా నుంచి అనంతము వరకు పోయే సంఖ్య విస్తరణవలే భారతీయ గణిత ప్రపంచము విస్తరిస్తూ కనిపించింది. అందులో యెన్నో మహోన్నత పర్వతాలు, అంతు, లోతు తెలియని అగాథాలు, విచిత్రాలు, యెన్నో అస్పష్టతలు, అనూహ్యమైన అద్భుతాలు, విజ్ఞానము, అపారజ్ఞానము అంతా కలగాపులగంగా భారతదేశ తత్త్వములానే గోచరించింది.