GARUDA THE BEGINNING by JONAATHAN Telugu book cover

GARUDA THE BEGINNING

by JONAATHAN

₹100
In stock · 13 available
PublisherV.SRINIVASA RAO
LanguageTelugu
గరుడ అమ్మచెప్పిన కథ If you want to fly, give up everything that weighs you down. ఈ పుస్తకం మీ ముందుకు రావడానికి కారణమైన ఒక చిన్న సంఘటన... గత కొన్ని సంవత్సరాలుగా డిప్రెషన్ అనే అంధకూపంలో పడి నైరాశ్యంతో, వేదనతో, ఇక బ్రతకడం వృథా అని చావుకి బ్రతుక్కి మధ్య పెండ్యులమ్లా కొట్టుకుంటూ కాలం వెళ్ళదీస్తుండగా, ఒక రోజు కొన్ని విషయాలను పదేపదే తలచుకుంటూ కుమిలిపోతుండగా, అమ్మ నాదగ్గరే కూర్చుని చెప్పిన ఈ కథ గాఢాంధకారంలో కాంతిరేఖను చూపించింది, గుండెల్లో కొత్త ధైర్యాన్ని రేకెత్తించింది. అనగనగా రెండు పక్షులు, సముద్రం ఒడ్డున ఒక పెద్ద చెట్టుపై గూడుకట్టుకుని హాయిగా ఉంటున్నాయి. గూడులో ఉన్న గుడ్లను పొదగడం కోసం ఆడపక్షి ఎపుడూ చెట్టు మీదనే ఉండేది. మగపక్షి పగలంతా తిరుగుతూ ఆహారాన్ని తెచ్చేది. పుట్టిన పక్షిపిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఆ రెండు పక్షులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నాయి. ఒకరోజు హఠాత్తుగా సముద్రుడు ఉప్పెన రూపంలో విరుచుకు పడ్డాడు. ఒడ్డున ఉన్న చెట్టుతోపాటు, ఎగరలేని పక్షిపిల్లలను కూడ తనలో కలిపేసుకున్నాడు. మగపక్షి తిరిగి వచ్చేటప్పటికి ఒడ్డున కూర్చుని దుఃఖంతో కుమిలిపోతున్న తల్లిపక్షిని చూసి జరిగినదంతా తెలుసుకున్నాడు. తట్టుకోలేని ఆవేదనతో, ఆక్రోశంతో... తమ పిల్లలను వెనక్కి ఇవ్వమని సముద్రుడిని పదేపదే వేడుకున్నారు, ప్రార్ధించారు.