GARUTMANTUDU HANUMANTUDU by LAKSHMANAREKA GOPALAKRISHNA Telugu book cover

GARUTMANTUDU HANUMANTUDU

by LAKSHMANAREKA GOPALAKRISHNA

₹30
In stock · 9 available
PublisherLAKSHMANAREKA GOPALAKRISHNA
LanguageTelugu
గరుత్మంతుడు - హనుమంతుడు శ్రీ మహావిష్ణువు తన జెండాపై గరుత్మంతుని చిహ్నంగా వుంచుకున్నాడు. ఆయన వాహనం కూడా గరుత్మంతుడే. ఎందుకంటే గరుత్మంతుడు మహా బలశాలి. తల్లి ఇచ్చిన మాటకోసం, తనయుడు చేసిన త్యాగానికి ప్రతీకగా గరుత్మంతుడు నిలబడ్డాడు. తనకు చేసిన సహాయానికి నీకేమి కావాలో కోరుకోమంటే, నీ సేవే నాకు కావాలన్నాడు గరుత్మంతుడు. అందుకే విష్ణుమూర్తి తనతో ఎల్లప్పుడూ వుండే వాహనంగా, జెండాపై గుర్తుగా వుంచుకుంటానని గరుత్మంతునికి మాట ఇచ్చాడు. శ్రీ వేంకటేశ్వరస్వామిని గరుడ వాహనంపై ఊరేగించడం తిరుమల తిరుపతిలో 'గరుడోత్సవం'గా ప్రతి సంవత్సరం ఒక వేడుకగా జరుగుతోంది. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధం ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి హనుమంతుడు అర్జునుడి అహంకారాన్ని అణచివేయాలని, అతనికి పాఠం చెప్పాలని ప్రయత్నిస్తున్నప్పుడు, అర్జునుడు గ్రహించి, తనను క్షమించమని అడిగి తనకు కౌరవులతో పోరాడి గెలిచేలా సహకరించమని కోరతాడు. హనుమంతుడు అర్జునుడిని మెచ్చి, తనకు తోడుగా వుంటానని మాట ఇస్తాడు. అప్పటి నుంచి తన పతాకంపై కపిరాజును చిహ్నంగా పెట్టుకుంటాడు అర్జునుడు. అదే అతని విజయానికి సంకేతం. అలా పతాకాల గుర్తుగా గరుడుడు, ఆంజనేయులు కీర్తి పొందారు. విధంగా ప్రసిద్ధులైనవారి ఇద్దరిని గురించి రాయాలని సంకల్పించాను.