
GATHAM GATHAHA
₹160
In stock · 4 available
PublisherR.C.KRISHNASWAMI RAJU
LanguageTelugu
ISBN9789355936233
'కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములు" అని అన్నాడు రామరాజభూషణుడు. కథలు పలు రకాలు.కాలక్షేపానికై సత్యదృష్టి లేకుండా, కల్లబొల్లి మాటలతో అల్లే కథలు కృత్రిమ రత్నాల వంటివి. వాటికి విలువ ఉండదు. పరమార్థాన్ని బోధించే సత్కథలు పుట్టు రత్నాల వంటివి. అవి పాఠకులను అజ్ఞానాంధకారం నుండి విజ్ఞాన ప్రకాశంలోకి తీసుకుపోతాయి. కథల విలువ అవి బోధించే పరమార్థాన్ని బట్టే ఉంటుంది. అట్టి కథలనే' ఆధ్యాత్మిక కథలు' అంటారు. వేదవ్యాసుడు భారతాన్నీ, పురాణాలనూ రచిస్తూ ఎన్నో కథలు చెప్పాడు. అయినా ఆయనకు మనశ్శాంతి కలుగలేదు. చివరికి నారదుని ప్రేరణతో ఆధ్యాత్మిక తత్త్వబోధకమైన భాగవత కథలు చెప్పి శాంతి పొందాడు. తద్ద్వారా ఇతరులకు కూడా శాంతి సుఖాలు కల్గించాడు. " ఈ కథలెందుకు వ్రాశావు?" అని అడిగితే "ఆత్మ విజ్ఞానాన్నీ, అశాశ్వతమైన భోగాల పట్ల వైరాగ్యాన్నీ బోధించడానికి వ్రాశానే కానీ, నా కవితా నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి కాదు." అని చెప్పాడు. కథాకథన చక్రవర్తి శ్రీ ఆర్.సి. కృష్ణస్వామి రాజు గారు కూడా కథారూపాలైన పలు గ్రంధాలు రచించి సహృదయుల హృదయాలలో నెలకొన్నారు. ప్రస్తుతం 'గతంగత:' అన్న శీర్షికతో తత్త్వబోధన ప్రధానాలైన నలభై కథల సంపుటిని రచించి కృతకృత్యులయ్యారు. ఈ కథలు ఆత్మోన్నతి పొందగోరే పిన్నల, పెద్దల హృదయాలలో అందుకు తగిన స్పందన కలిగిస్తాయనడంలో ఏమాత్రం సంశయం లేదు. ఇవి ఇంతకు ముందే ప్రసిద్ధ పత్రికలలో ప్రచురించబడి పాఠకులనలరించాయి. శాంతి సుఖాలు పొందగోరే ప్రతివ్యక్తీ పఠించవలసిన ప్రకృష్ణ గ్రంధమిది.