
GATITAARKIKA BOUTHIKAVAADAM-65
by RVR
₹65
In stock · 175 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
తత్వశాస్త్రం అంటే? “ఈ సృష్టికి ఏమర్థం? మానవునికి గమ్యమేది?” (సదసత్సంశయం : శ్రీశ్రీ) చాలా పెద్ద సందేహమే. ఇలాంటి సందేహాలకి సమాధానం కావాలంటే ఏ పుస్తకాలు చదవాలి? ఏ శాస్త్రాలు వెతకాలి? ఏ పీఠాధిపతుల్ని సంప్రదించాలి? ఏదేనా జబ్బు చేసిందనుకోండి, డాక్టరు దగ్గరి కెడతాం. "వైద్యో నారాయణో వారి" అని దణ్ణం పెడతాం. ఆ "యమరాజు సహోదరుడు" యథాశక్తి “ధనానిచ” "ప్రాణానిచ" హరించో, హరించకో యేదో కషాయం పోస్తాడు. అంటే జబ్బు చేస్తే వైద్యశాస్త్రం వుంది. అలాగే డబ్బు సంపాదించాలనుకోండి, వ్యాపారంలో దిగుతాం. ఇక అక్కణ్ణుచి "ముడుపులు,” “చేతి తడుపులు" లాంటి విద్యలన్నీ వొంటపట్టించుకుని వ్యాపారం పారం చూస్తాం. “చేతుల్లో రూపాయల చెట్లు మొలుస్తాయి. అవి బ్యాంకుల్లో బంగారపు గుడ్లు పెడతాయి. ఏ తడుపులూ ముడుపులు వొద్దని ఆంక్షలు పెడితే యిక వ్యాపారం అంతా స్తంభించి పోతుం”దని ఘన శ్యామ్ఎస్ బిర్లాగారికి ఆయన కొలువులోని అనుంగు తాబేదార్లు జ్ఞానోపదేశం చేశారట! ఆయన వ్యాపారానికి అన్యాయం తోడు ఉండాల్సిందేనా. "హతవీధీ" అని హృదయంలో కళవళపడి మౌనంగా ఉండిపోయారట. మౌనం మామూలుగా అర్ధాంగీకారమే అయినా దాన్నే పూర్ణాంగీకారంగా గ్రహించిన ఆ ధర్మ ప్రభువులు భారతదేశానికి "సాతంత్రం" వచ్చినాటినుంచీ బిర్లాగారి ఆస్తుల్ని యెలా పెంచి పోషించారో ఏ లక్ష్మీనారాయణ దేవళంలోనయినా చూడవచ్చు. ఇంతకీ విషయం ఏమిటంటే దీనికో పెద్ద శాస్త్రం వుంది. అదే కామర్సు, వాణిజ్యశాస్త్రం. చార్టర్డు ఎకౌంటెంట్లు, ఇన్కంటాక్స్ ప్రాక్టీషనర్లు, కంపెనీ లా -తత్సంబంధమైన లాయర్లు, కాస్ట్ ఎకౌంటింగ్ - ఒకటేమిటి, ఈ 'నదుల' సరంజామా అంతా సమస్తాశావకాశంబులన్" అని పాపం, ఆస్తుల "సాగరోగతిః." అలాగే రకరకాల యితర శాస్త్రాలు ఉన్నాయి. దేనికి దానికి దాని సొంతగోల ఉది. సిద్ధుడికి భోజనం పెట్టాక కుతూహలం కొద్దీ ప్రవరుడు విశేషాలు అడుగుతాడు. ఆ సిద్ధుడు బ్రేవ్ మని తృప్తాస్మా అంటూ త్రేన్చి “ఈ యాదేశంబన నేల చూచితి ప్రవరుడి కుతూహలంలో ఆజ్యం పోస్తాడు. నేనూ వెళ్ళాలి, చూడాలి వెర్రి బ్రాహ్మణుడు ఆత్రుతపడతాడు. ఇంగ్లీషు వాళ్ళ 'సెవెన్ లీగ్ బూట్సు' లాగా పాదుకాసిద్ధి లేపనం ప్రవరుడి కాళ్ళకి ఆ సిద్ధుడు పూస్తాడు (యిక తరువాయి కథ 'మనుచరిత్ర'లో చదువుకోండి). ఆ రోజుల్లో మరి జెట్ విమానాలు అంజనాలూ, అని ఆ