
GAYAPADINA SANTHI
₹20
In stock · 9 available
PublisherMADIRAJU RANGARAO
LanguageTelugu
స్వేచ్ఛా కవిత్వం పరంపరా క్రమంలో ఇది "117" వది, "గాయపడిన శాంతి” ఇది వర్తమాన సమాజంలో ఉగాది ఉత్సాహ లహరులపై నుండి కాంతి శిఖరాలను స్పృశిస్తూంది. ఈ మధ్య సమయాలలో అలజడి ఆక్రందన ఆర్తి విషాదంతో సహనం ప్రేమ కరుణ ఉత్సాహం శమంకోరే పలు సందర్భాల్ని పురస్కరించుకొని సాగింది. ఇది వర్తమాన సమాజ స్థితుల్ని తలపిస్తుంది. పట్ట పగలు చీకటి పేలికలు మనుషుల ముఖాల్ని కప్పేయడం కనిపిస్తుంది. చూడకూడని ఘటనలు జరిగిపోతున్నాయి, చేయరాని పనులు సినిమాలో విపరీత దృశ్యాల్ని మించిపోతున్నాయి. వ్యక్తి స్థాయిలో మొదలై సమాజ చలనంలో పరివర్తన లక్ష్యంతో కవిత్వంలో అనివార్యమైన దార్శనిక ప్రభావాన్ని భావింపచేస్తూంది. స్థిరత, దృఢత నైతికతతో పాటు స్పందన గుణం ప్రజాస్వామ్య భావజాలంతో ఆకర్షిస్తుంది. అక్షర జగత్తు నుండి వెలువడిన సామాజిక చేతనా రూపం ప్రగతి శీలంతో సంపన్నమయింది. ఈ సందర్భంలో ఎప్పటి వలెనే భావరూపాలు (Images) ప్రతీకలు (Symbols) అనుభూతి ముద్రలు సహృదయుల కళాత్మక చింతన కందుతాయి. ఆధునికం గుణ వాచిగా కవిత్వంలో అనితరమైన అవసరమైన సామాజిక పాత్రను వహిస్తుంది. ఇరవై ఏండ్ల కొకసారి కవులు వస్తూన్న మార్పుల్ని గుర్తించడం, వాటిని పరిశీలించడం అవసరం, అవసరమైన మార్పులకు సిద్ధం కావడమూ మంచిది. ఇది సాహిత్య విమర్శలో భాగంగా మంచి పాత్రను నిర్వర్తిస్తుంది. కవి దృష్టి ఏ స్థితిలోను ఏదో ఒకచోట నిలిచిపోదు, సాగుతూనే ఉంటుంది. విశ్వమయతను పొందుతుంది. భూమిపై నడకతో మొదలయిన మనిషి ఆపైన నీరు గాలి గగనం ఆశ్రయించవలసి రావడం, గెలిచే విధం, వైజ్ఞానిక విజయాలు, వికాస దశలతోనే. ఈ స్థితి నిస్సందేహంగా అన్ని విషయాలలో వర్తమానంలో ఆధునికత యొక్క అనివార్యతను జ్ఞప్తికి తెస్తుంది. అక్షరంలో నిక్షిప్తమైన కంటికి కనిపించీ కనిపించని భావలోకం పరిమళ పవమాన సుందరతను పొందుతూంది. దీనికిదే సాటిగా నిలుస్తుంది. కవి పాత్ర ఒకరు చెపితే ఏర్పడేది కాదు, ఎవరికి వారు స్వతంత్రంగా రూపొందే స్వేచ్ఛా వ్యక్తిత్వంతో స్వయం మనో విషయం. ప్రగతి భావనతో సమాజ సుహితకరమయింది. హృదికి హ్లాదమయమయింది.