
GAYATRI TATWARAHASYAMU
₹100
In stock · 24 available
PublisherGOLLAPUDI TIRUPATHIRAO
LanguageTelugu
గాయత్రీ తత్వ రహస్యము స్వర్గీయ గొల్లపూడి సుబ్రహ్మణ్యశర్మ గారి జీవనం ఒక అద్భుత కాలచక్ర గమనం దాదాపు నలభైయేళ్ళక్రితం ఉద్యోగరీత్యా గొల్లపూడి తిరుపతిరావు గారు మదనపల్లె వచ్చినప్పుడు ముఖపరిచయం. తరువాత, తరువాత మామధ్య ప్రగాఢ స్నేహం. ప్రసంగ వశాత్తు ఒకపర్యాయం వారి తండ్రిగారి జీవనయానం గూర్చి గొల్లపూడి తిరుపతిరావు గారు సజలనయనాలతో హృద్యమంగా తెలియజేయడం జరిగింది. వాస్తవానికి ఒక మంచి నవలగా వ్రాయగల అంశం కీ॥శే॥ గొల్లపూడి సుబ్రహ్మణ్యశర్మ గారి జీవనయానం!! ఆ అద్భుత గాథను నేను పలుమార్లు చెప్పించుకుని విన్నాను. 'మంత్ర మీమాంస నర కంఠీరవ', 'జ్యోతిష చక్రవర్తి' మొదలగు బిరుదులు పొందిన ఆ మహానుభావుని జీవితంలో ఇహలోక పరమైన ఆర్థిక సంబంధిత విషాదా లను గూర్చి వింటున్నప్పుడు హృదయం ద్రవించిపోయేది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా, గూడూరు దగ్గరి మనుబోలులో తమ బావమరది అయిన పంచాగ్నుల వెంకటసుబ్బయ్య గారి ఇంట తమ భార్యను, ముగ్గురు పిల్లలను వదిలి రెండేండ్లపాటు అజ్ఞాత వాసానికి వెళ్ళేముందు ఒక కాలిదారిలో వారు పిల్లలకు పరిస్థితులు వివరించి హితబోధ చేసినవైనం, నల్లమల అటవీ ప్రాంతంలో కనీసం కాలిదారులు, నరసంచాలంలేని భైరవకోనలోని పంచముఖ దుర్గను ఉపాసిస్తూ ప్రతేయేడాదీ నెలరోజులపాటు గడిపిన విషయాలు, దేవీసాక్షాత్కార వైభవం, చివరికి కొన్ని ఘటనల ద్వారా పుల్లంపల్లె రెడ్లచే గుర్తింపబడి వారి సహకారంతో 1952లో ధర్మవరంలో స్థిరపడి నెల్లూరు స్వామిగా ప్రసిద్ధిచెందడం, ఈ గ్రంథరచన, ముద్రణ... వారి చివరిరోజులు అన్నీకూడా ఒక సమగ్ర అమూల్య గ్రంథం లిఖించ డానికి తగిన కథాంశాలు. దురదృష్టవశాత్తు ఈ గ్రంథం కాపీలు ఎక్కడా లేకపోవడం, నా ఒత్తిడితో గొల్లపూడి తిరుపతిరావు గారు ఒక కాపీని సంపాదించి పుణర్ముద్రణకు పూనుకోవడం ముదావహం. ఈ గ్రంథానికి విద్వాన్ సి. మునస్వామిగారు మరో మున్నుడిని, హాజీ వేంపల్లి అంబుల్భాదర్గారు ఆప్తవాక్యం అందించి సహకరించి నారు. వారికి ధన్యవాదాలు. భగవంతుడు నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తే ఆ కారణజన్ముని జీవన యానాన్ని గ్రంథస్తం చేయాలన్నది నా ప్రగాఢ ఆకాంక్ష.