
GEDE MIDI PITTA
by TALLAVAJHULA PATANJALI SASHTRI
₹100
In stock · 6 available
PublisherCHINUKU PUBLICATIONS
LanguageTelugu
గేదె మీది పిట్ట అతని ముఖం గడ్డం కింద కొంచెం ముదిరింది. చెంపల దగ్గిర అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు ఆశ్చర్యా ర్థకాల్లాగ కనిపిస్తున్నాయి. కొంచెం రంగు వేసుకోవాలి. పరీక్షగా చూసుకున్నాడు ప్రకాష్. జుట్టు కొంచెం పలచబడింది. పొట్టలేదు. ("ఇన్నేళ్ల నుంచీ అట్లాగే ఉన్నావు బాస్"). తలమీద కూడా రెండు మూడుచోట్ల తెల్ల మొలకలు. కళ్లలోకి పరీక్షగా చూసుకున్నాడతను. బాగనే ఉన్నాయి. నిశ్శబ్దంగా ఉన్నాయి. ఏవీ అనడం లేదు. పళ్లు కూడా తళతళలాడ్డం లేదు గానీ శుభ్రంగా ఉన్నాయి. నురుగు గడ్డానికి పెట్టుకున్నాడు. జాగ్రత్తగా, సున్నితంగా గడ్డం గీసుకున్నాడతను. నున్నగా ఉంది. మళ్లీ నురుగు పెట్టి మళ్లీ నున్నగా గీసుకున్నాడు. గడ్డానికి కమ్మటి లోషను పూసుకున్నాడు ఆదిప్రకాష్,