GEETARAMAM by PUTTAPARTHI NAGAPADMINI Telugu book cover

GEETARAMAM

by PUTTAPARTHI NAGAPADMINI

₹40
In stock · 1 available
PublisherPUTTAPARTHI NAGAPADMINI
LanguageTelugu
భావాంజలి 'గీతారామం' పాటల తోట. తోటలో అనేకానేక పుష్పాలు ఉంటాయి. వివిధ వర్ణకాంతులతో మన మనస్సులను అలరిస్తాయి. పరిమళాలు వేరైనా వేటి ప్రత్యేకత వాటిదే! ఈ 'పాటల తోట'లోనూ వివిధ అంశాలపట్ల నా స్పందన ఉంది. వివిధ సందర్భాలలో, నా భావోద్యానంలో ఉంచిన సుమాలను ఇలా మీముందుంచేందుకు ప్రోత్సహించిన నా జీవిత భాగస్వామి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల హర్షవర్ధన్ గారికి బహుకరించడం నా విద్యుక్త ధర్మం. పెళ్లైన తరువాత సైతం నా ఉన్నత విద్యనూ, రచనా వ్యాసంగాన్ని కొనసాగించగలుగు తున్నానంటే అది కేవలం వారి సహృదయ సహకారం వల్లనే కదా! అందుకే ఈ 'గీతారామాన్ని' వారికి అప్పజెప్పటం ఆనందదాయకంగా ఉంది. అందంగా ముద్రించిన 'అంకుశ్ గ్రాఫిక్స్' ఆకృతి ప్రింటర్స్ అధినేతలకు కృతజ్ఞాంజలులు. ఈ గీతాలలో కొన్ని ఇప్పటికే క్యాసెట్లలో రికార్డ్ చేయబడ్డాయి. ఆకాశవాణిలో ప్రసారం చేయబడ్డాయి. వాటిని స్వరపరచిన సంగీత నిర్వాహకులకూ, గాయనీ గాయకులకూ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పుస్తకరూపంలో వెలువడుతున్న నా ఈ 'గీతారామం' లోకి సహృదయ పాఠక, గాయక లోకానికి నా ప్రేమ స్వాగతం. వీటికి రాగాలనద్ది అలరించాలని అభిలషించే మిత్రులకు అభిమాన పూర్వక స్వాగతం. ఇంకేం! ఆరామంలోకి అడుగిడండి! నా గీతోద్వేగాన్ని ఆదరించండి!