GEETHA ANTARAARDHAM by KAWTHA MARKANDEYA SASTRY Telugu book cover

GEETHA ANTARAARDHAM

by KAWTHA MARKANDEYA SASTRY

₹200
In stock · 12 available
PublisherKAWTHA MARKANDEYA SASTRY
LanguageTelugu
గ్రంథకర్త పరిచయం కౌతా మార్కండేయ శాస్త్రి 22-09-1946 న శ్రీమతి కౌతా శ్యామలాంబ, సుబ్బారావు దంపతులకు గుంటూరు నందు జన్మించిరి. హిందూ కళాశాల, గుంటూరులో గణితము, సైన్స్లలో పట్టభద్రులు అయ్యిరి. సంస్కృతము కళాశాలలోనూ మరియు ప్రత్యేకముగానూ చదివిరి. విశాఖపట్నంలో ఎం.ఎ. (గణితము) చదువుతూ 22-09-1970 న శ్రీమతి కొత్తపల్లి కనకదుర్గాంబ, రామపూర్ణచంద్రరావుల తృతీయ పుత్రిక శుభలక్ష్మిని వివాహము చేసికొనిరి. ఆధ్యాత్మిక ఉన్నతికై ఆసేతు హిమాచల పర్యంతము విస్తృతముగా పత్నీసమేతముగా పర్యటించిరి. స్వప్నంలో దర్శనమిచ్చిన శ్రీ శాయిబాబావారి దివ్యమైన సలహామీద శ్రీశ్రీ యోగనందస్వామివారి క్రియాయోగదీక్ష తీసికొనిరి. తీవ్రధ్యానము చేసి పది లక్షల కన్నా ఎక్కువ క్రియలు చేసి వారి ప్రీతిపాత్ర శిష్యులయ్యిరి. ధ్యానములో దంపతులిద్దరికి ఎన్నో మారులు సత్ గురువుల, సప్తర్షుల, త్రిమూర్తుల, దివ్యపురుషుల దర్శనములు అయినవి. ఈ విషయము బాహాటంగా చర్చించుటకు ఇష్టపడరు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగవిరమణ తదుపరి 09/10/2006న తమ స్వంతఖర్చుతో క్రియాయోగ ລ້ ໖໖. (Dn76, Devinagar, RK Puram Gate, Secunderabad-56) 2 ລ້ క్రియాయోగ సుశిక్షితులను చేసిరి. ఈ మందిరములో ధ్యానము చేసిన పెక్కుమంది భయంకరమైన రుగ్మతలనుండి విముక్తి పొందిరి. చాలా మందికి ఆత్మ సాక్షాత్కారము. దివ్యదర్శనములు అయినవి. ఈ దంపతుల కుమార్తె శ్రీమతి వేమూరి శ్యామల, అల్లుడు మహేష్, మనుమరాలు ఋషి మరియు మనమడు డుద్ర అందరూ క్రియాయోగ దీక్షాపరులే, శ్రీ శాస్త్రిగారు పెక్కు ఆధ్యాత్మిక గ్రంథములు ఆంగ్లం, హింది మరియు తెలుగు భాషల్లో మహావతార్ బాబాజీ అనుగ్రహముతో రచించిరి. బాబాజీ వారి దివ్య ఆశీస్సులతో ఈ గీత అంతరార్థం ఆంగ్లం, హింది మరియు తెలుగు భాషల్లో రచించిరి. ధ్యానములో దర్శనము ఇచ్చిన వేమన ఆదేశము ప్రకారము వేమన ఒక క్రియాయోగి అనే అధ్యాయము ఈ అంతరార్థంలో ఒక ప్రత్యేక ఆకర్షణ. ధనాపేక్ష లేకుండా, గురువులు అనుగ్రహించిన క్రియాయోగ మార్గమును ఆధ్యాత్మిక ఆర్తులకు ఉపదేశించుటయే ఆ దంపతులిద్దరి జీవితాశయము.