
GEETHA GOVINDAM
₹100
In stock · 1 available
PublisherPROF.SRI SURYAPRAKASH
LanguageTelugu
గీతా గోవిందం మొదటి భాగం - గీతా సందర్శనం పరిచయం ప్రపంచంలోని శాస్త్ర గ్రంథాలన్నింటిలో భగవద్గీత అగ్రగణ్యమైనది. ఇది సమస్త మానవాళికి పూజనీయమైన పరమ పవిత్ర గ్రంథం. గీత ఒక ఉపనిషత్తు, బ్రహ్మవిద్య. యోగశాస్త్రం. శ్రీకృష్ణార్జున సంవాదం. అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం, ఆరోగ్యానికి దివ్యౌషధం. సమాజానికి సంజీవని, యువతకు భవిత. జీవన మార్గం. తాత్త్వికులకు బ్రహ్మవిద్య, విద్యార్థికి కొంగు బంగారం, శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడికి భగవద్గీత చెప్పిన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. అదే గీతా జయంతి. భగవద్గీత ఉద్భవించి నేటికి 5150 సంవత్సరములు గడిచినవి. గీతా ప్రారంభం ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో శ్వేతాశ్వాలను పూన్చిన మహారథంపై సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు నిలబడి తన ప్రియ శిష్యుడైన అర్జునుడి సంసార వ్యామోహాన్ని తొలగించడానికి దివ్య జ్ఞాన సంపన్నములైన శ్లోకాలను సంతోషంతో గానం చేసాడు. అవే శ్రీకృష్ణ భగవానుని ముఖారవిందం నుండి స్రవించిన గీతా సూక్తి సుధలు, జీవుడ్ని సంసార సాగరం నుండి తరింపజేసే జ్ఞాన బోధలు. వీటిని పఠించి పాడి ఆనందించి తరించండి. సమయం, తీరిక తక్కువున్న వాళ్ళ కోసం ఈ కోర్సు రూపొందించబడింది.