
GEETHASARAMU
₹81
In stock · 11 available
PublisherMALLARAPU DORASWAMY NAIDU
LanguageTelugu
XXV ముందుమాట సరణనసమ్మతమైనది, శ్రేయస్కరమైనది మతము. ప్రపంచమున సర్వమతముల సారాంశము, లక్ష్యము ఒకటియేయైనను, ఆయా దేఖాంశముల భౌగోళిక, శీతోష్ణస్థితులననుసరించి, ఆచార వారాలు, ఆహార పానీయాలు, వేషభాషలు, స్వరూప స్వభావాలలో సనముబడులచే భిన్నమతము లేర్పడినవి. ఇవి సువిశాల దృక్పథముతో, సమాజశ్రేయస్సును కోరి, నిష్కామ దైవస్వరూపులగు మహాత్ములచే కలపబడిన మహత్తర సిద్ధాంతములతో నుండినవి. వేదభూమి, కర్మభూమి యి. మన దేశమున వెలసిన అతి ప్రాచీన, సర్వలక్షణ, సమగ్రమైన హిందూ మతము. more వేదవేదాంతముల సారమంతయు వడబోసి, హైందవుల మనుగడకు మార్గదర్శిగా, గీతలో నిక్షిప్తము చేయబడినది. 'గీ' అనగా త్యాగము. 'త' అనగా తత్త్వబోధన. మనిషిలోని స్వార్ధమును దహించి మోక్షసాధన మును బోధించునది గీత. ఇది భగవంతుని ముఖతః వ్యాసమహర్షి చెప్పించుటచే ఇది భగవద్గీతయైనది. ఇది సర్వజన, సర్వకాల, సర్వావస్థల ముప్రీతికర, సత్ప్రయోజనకారి. కనుకనే ప్రపంచములోని ప్రతి ముఖ్య భాషలలోనికి ఇది అనువదింపబడినది. అనేక భాషలలో అనేక వ్యాఖ్యానాలతో విరబూసినది. ఒక్క ఉర్దూ భాషలోనే ఇరవైకి పైగా వ్యాఖ్యానాలు లభించుచున్నవి. ఈ పవిత్ర గ్రంథరాజము మానవసేవకు, సమాజశ్రేయస్సుకు, జగత్ప్రవృద్ధికి మిక్కిలిగ దోహదము చేయుచున్నది. సర్వజనులకు, సర్వమతములకు ఆదర్శవంతమైనది. జీవనమనుగడలో -దురైన ఏ సమస్యకైనను పరిష్కారమును చూపుచు వేనోళ్ల కొనియాడ బడుచున్నది.