GEETHOPADESAM by D.KAMESHWARI Telugu book cover

GEETHOPADESAM

by D.KAMESHWARI

₹150
In stock · 18 available
PublisherD.KAMESHWARI
LanguageTelugu
డి.కామేశ్వరి గీతోపదేశం నివురుగప్పిన నిప్పును చూసినా, సన్నగా పారే సెలయేరును చూసినా, గాలికి పొంగి, గిరికీలు కొడుతున్న బెలూనన్ను చూసినా నాకు డి. కామేశ్వరిగారూ, వారి రచనలూ గుర్తొస్తాయి. నిప్పూ, నీరు, గాలీ అణగిమణిగి ఉన్నంత వరకూ ఏమీ కాదు. చెలరేగితేనే పెను ప్రమాదం. ఈ ప్రమాదాన్ని కామేశ్వరిగారి రచనల్లో స్పష్టంగా చూస్తాం. ఈ ప్రపంచాన్ని మార్చడానికి మాయలూ, మంత్రాలూ అక్కరలేదు. తనలో ఉన్న శక్తి చాలు అనుకునే గొప్ప రచయిత్రి ఆమె. పేదలకు ఆశను కలిగించే మధ్యతరగతినీ, మధ్యతరగతికి ఆకర్షణను కలిగించే ధనికవర్గాన్నీ కళ్ళకు కట్టడమేకాదు, వారి వారి ఆశలూ, ఆకర్షణలూ ఎంత బాధాకరమో, మరెంత ప్రాణాంతకమో చెప్పగల దిట్ట డి. కామేశ్వరిగారు. వారి రచనలు చదవడం అంటే... ప్రతిధ్వనిని సృష్టించి, నీడచేత నృత్యం చేయించడంగా నేను భావిస్తాను. ఆ భావనతోనే వారికి రెండు చేతులూ జోడించి నమస్కరిస్తున్నాను. -జగన్నాథశర్మ ఎడిటర్ నవ్యవీక్లీ