GELUPU - 125 by DR.T.S.RAO Telugu book cover

GELUPU - 125

by DR.T.S.RAO

₹125
In stock · 3 available
PublisherDR.T.S.RAO
LanguageTelugu
ఒక సామాజిక నేరం మంచి పుస్తకం చక్కని ప్రేరణ కలిగించగలదు. జీవిత లక్ష్యం చేరడానికి మార్గం చూపించగలదు. నిర్దేశించే వారు లేకపోయినా, ఒక పుస్తకం మనిషిలో అద్భుతమైన ప్రేరణ కలిగించడంతోపాటు వైస్త్యవంతుడిగా తీర్చిదిద్దగలదు. సమాజంలో కేవలం పుస్తకంలోని విషయాలను చదివినంత మాత్రాన తమ గమ్యాన్ని చేరుకోలేరు. తమ కలలకు సాకారం చేసుకోలేరు. దేనికయినా చదివింది నిత్య జీవితంలో ఆచరించాలి. ఆచరించడానికి నాంది–ప్రయత్నం. డాక్టర్ టి.యస్. రావుగారు రాసిన ఈ గెలుపు పుస్తకం సారాంశమే ప్రయత్నించు, ప్రయత్నించు, ప్రయత్నించు. జీవితంలో ప్రయత్నం చేసినప్పుడు విఫలం కావచ్చు. మళ్ళీ ప్రయత్నించాలి, మళ్లీ మళ్ళీ ప్రయత్నించాలి. అప్పుడే విజయానికి చేరువవుతాము. వైఫల్యాలకు వెన్నుచూపే పరిస్థితి కలలో కూడా వాకూడదు. ఆ లక్ష్య సాధనకు తగిన సమయం, శ్రద్ధ, బలమైన కోరిక ఉంటే ఎటువంటి విజయాన్నయినా సాదించవచ్చు. నిరుత్సాహం, నిస్పృహ, నిరాశ, నిర్లక్ష్యం విజయానికి అడ్డంకులు. "ఒక పిల్లవాడు సైకిల్ తొక్కాలనుకుంటాడు. తొక్కాలనే బలమైన కోరిక అతనికి కాళ్ళు అందకపోయినా తొక్కేలా చేస్తుంది. ముందుగా అడ్డ సైకిల్ నేర్చుకుని, క్రింద పడినా మళ్లీ లేస్తూ, మళ్ళీ మళ్ళీ లేస్తూ చివరికి సైకిల్ నేర్చుకుంటాడు. ఆపైన ఛాంపియన్ అవుతాడు" అంటారు రచయిత వాక్టర్ టి.యస్.రావు. ఇది అక్షరాలా వాస్తవం. ఈనాడు మనం ఉపయోగిస్తున్న బల్బు, టివీ, టెలిఫోన్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు అందరూ ముందు వైఫల్యాలు రుచిచూసారు. "నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్", చీమ, కొంగ, గ్రద్ద, పాము, కప్ప వంటి జీవాలకు ప్రయత్నించు, ప్రయత్నించు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు... అనే ఆలోచన సహజ సిద్ధంగానే ఉంటుంది. ఆ జీవాలు తమ ఆహారం కోసం అలా ప్రయత్నించి ఉండకపోతే ఈ పాటికి ఆ జాతులు అంతరించి ఉండేవి. మనం డైనోసార్లాగ వాటి గురించి పుస్తకాలలోనే చదువుకునే వాళ్ళం. తమలో శక్తి సన్నగిల్లినప్పుడు తమ కోరికను రెట్టింపు చేసుకుని ఉత్తేజపరచుకుని, బలం చేకూర్చుకుని మళ్ళీ సమర్ధవంతంగా తమ పని తాము వేసుకుపోతాయి. ఆ విషయాన్ని రచయిత గ్రద్ద కధలో చక్కగా, స్ఫూర్తిదాయకంగా వివరించారు. 'ట్రై అండ్ ట్రై టిల్ యు సక్సీడ్' అనే విషయాన్ని ప్రస్తుత యువతరానికి అర్ధం అయ్యేలా, ఆచరించేలా రచయిత చక్కని ఉదాహరణలతో వివరించారు. పుస్తకం మొదటి నుండి చివరిదాకా చదివించేలా వుంది. సందర్భానుసారంగా నిత్యజీవితంలోని సంఘటనలు పేర్చి అందించారు. వారికి అభినందనలు.