GENERAL SCIENCE by MUTYALA PRASAD Telugu book cover

GENERAL SCIENCE

by MUTYALA PRASAD

₹75
In stock · 21 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
విశ్వసృష్టి ఆద్యంతాల మధ్య అనంతకాలయాత్రలో... "మెదడన్నది మనకున్న ది అది సరిగా పనిచేస్తే విశ్వరహః పేటికా వి పాటన జరగక తప్పదు." అని మహాకవి శ్రీశ్రీ ఒక కవితలో పేర్కొన్నారు. పదార్థ ఆవిర్భావం జరిగి మానవుడు రూపొంది క్రమ క్రమానుగత చై తన్య విలసితుడవుతున్న నాటి నుంచి తన చుట్టూ వున్న ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి అనేక కల్పనలు చేశాడు. భ్రమలకూ, వాస్తవాలకూ మధ్య తేడా తెలియని, తెలుసుకోలేని ఆదిమ కాలంలోనే మనిషి ప్రకృతినీ, ప్రకృతి నియమాల్నీ, విశ్వరహస్యాల్నీ తనకున్న పరిమితులలోనే వ్యాఖ్యానించి నిర్వ చించే ప్రయత్నం చేశాడు. అనంతమూ, అపారమూ అయిన ఈ విశ్వసృష్టికి మూలం ఏమిటి? నదీ పదాలు, సముద్రాలు, మహాసాగరాలు, కొండలు, బిలాలు. అగ్ని పర్వతాలు ఎలా జనించాయి? దివారాత్రాల కాల చక్ర పరిణామాన్ని శాసించుతున్న నియ మాలు ఏమిటి? నక్షత్రాలకు మూలమేమిటి? గ్రహగతుల మార్పులకు అర్థం ఏమిటి? సృష్టికీ, కాలానికి, శూన్యానికి మధ్య వున్న అనుబంధం ఏమిటి? అభివృద్ధి చెందుతున్న మానవుడి ముందు ఇలా ఎన్నో ప్రశ్నలు నిలిచాయి. "చారిత్రక విభాత సంధ్యల మానవకథా వికాసమెట్టిది?" అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. జవాబుల అన్వేషణకు ఉపక్రమించాడు. అగ్నిని సృజించడంతో ఆరంభమైన విజ్ఞానశాస్త్రం క్రమ క్రమంగా పురోగమించి JS-1