GENETIC ENGINEERING by J.KONETIRAO Telugu book cover

GENETIC ENGINEERING

by J.KONETIRAO

₹42
In stock · 3 available
PublisherMANASA PRACHURANALU
LanguageTelugu
జెనెటిక్ ఇంజనీరింగ్ 1) కొన్ని ప్రాథమిక విషయాలు జీవశాస్త్ర రంగంలో ఇటీవలికాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పులు మానవ జీవన సరళిలో అనూహ్యమైన మలుపులను తీసుకొని వస్తున్నాయి. వీటి ఫలితాలు రాబోయే కాలాలలో మానవ కళ్యాణానికి ఎంతగానో తోడ్పడతాయి అనడానికి సందేహం లేదు. ఈ రంగం జీవశాస్త్ర పరిధులను దాటి రసాయనిక శాస్త్రము, భౌతికశాస్త్రము మొదలైన వాటి ఆవరణలలోకి ప్రవేశిస్తుంది. మొత్తానికి అనేక ఆధునిక పనిముట్లు పరిశోధనల సహాయంతో శాస్త్రజ్ఞులు జీవన రహస్యాలను ఛేదించ గల్గుతున్నారు. ఈ రంగానికి అనేక పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బయో ఇంజనీరింగ్, మాలికులార్ బయోలజీ (అణుజీవశాస్త్రం), రీకాంబినెంట్ టెక్నాలజీ, జీన్ స్పెయిసింగ్ మొదలైనవి. జీవి నిర్మాణంలో ప్రోటీన్ అణువులు ప్రాముఖ్యం వహిస్తాయి. వీటి అధ్యయనం మీదనే ఈ శాస్త్ర పునాదులు పురోభివృద్ధి ఆధారపడి వుంటుంది. అందుకనే మాలికులార్ బయాలజీ అంటారు. సూక్ష్మ ఇటికలు శరీర భవన నిర్మాణంలో ఇటికలు జీవకణాలు. ఇది చాలా మందికి తెలుసు. ఇదొక ప్రమాణము లేదా యూనిట్. కొన్ని జీవరాసుల్లో జీవపదార్థం అంతా ఒకే ఒక కణం లేదా ప్రమాణంలో ఉన్నట్లు కనబడుతుంది. అమీబా, యూగ్లీనా, బాక్టీరియా వంటివి. అయితే అనేక జీవరాసుల్లో అలాకాక వందలు, వేలు, లక్షలు, లేదా కోటాను కోట్లు కణాలు గోచరమౌతాయి.