GEO LAKSHMAN KATHALU by GEO LAKSHMAN Telugu book cover

GEO LAKSHMAN KATHALU

by GEO LAKSHMAN

₹200
In stock · 12 available
PublisherANANDASAI PRACHURANALU
LanguageTelugu
హాయిగా చదివించే కథలు జియో లక్ష్మణ్ గారి కథలు హాయిగా చదివిస్తాయి. ఆసక్తికరంగా ప్రారంభమై, కథ ముగిసేసరికి మెరుపు మెరిసినట్టుగా యేదోవొక మానవీయ విలువలను ప్రతిపాదిస్తూ ముగుస్తాయి. మధ్యతరగతి జీవితాల్లో వుండే అన్నిరకాల సమస్యలనూ స్పృశిస్తాయి. తల్లిదండ్రుల్ని పట్టించుకోని పిల్లలూ, పిల్లలకోసం త్యాగాలు చేసే తల్లిదండ్రులూ, భార్యల్ని ముంజేతి చిలకల్లా కాపాడుకునే భర్తలూ, పిడికెడు తిండికోసం దొంగతనం చేసే నిర్భాగ్యులూ, మాన్యులయ్యే సామాన్యులూ, సామాన్యులయిపోయే మాన్యులూ.... లక్ష్మణ్ గారి సాహిత్య ప్రపంచం మనకు రోజూ కనిపించే వాస్తవ ప్రపంచమే! వాస్తవికతను కొంతయినా రంగు పులమని యధార్థ జీవనాలే లక్ష్మణ్ రి కథా వస్తువులు. యీ కథలు చదువుతున్న పాఠకుడు అందుకే అప్పుడప్పుడూ భుజాలు చరుచుకుంటాడు. తడుముకుంటాడు. తనకు తెలిసిన వ్యక్తులూ, సంఘటనలూ గుర్తుకొచ్చినప్పుడు 'నిజమే కదా!' అని నిట్టూరుస్తాడు. సత్యమేదో బోధపడినప్పుడు యికనైనా తనను తాను సరిదిద్దుకోవల్సిందేనని తెలుసుకుంటాడు. జియోలక్ష్మణ్ గారి కథలు సరళంగా, సూటిగా చెప్పవలసినదేమిటో డొంక తిరుగుడు లేకుండా చెప్పేస్తాయి. వొకదాని వెంట వొకటిగా, విడిచిపెట్టకుండా, కథలన్నింటినీ వొక గుక్కలో చదువుకోవచ్చు. జీవిక కోసం శాస్త్ర సంబంధమైన ఉద్యోగం చేస్తూ, జీవితాన్ని ఆధ్యాత్మికతవైపుకు నడిపిస్తున్న ఒక మంచి మానవుడి సృజనాత్మక ప్రపంచమిది. వాన వెలిసిన తరువాత వీచే కొండగాలిలా మంద్రంగా, హాయిగా, సునిశితంగా సాగే రచనలివి. ఇవి జడివానల్లా, తుఫానుల్లా వూపి పారేయవు. మంచి స్నేహితుడొకడు భుజంపైన చేయి వేసి నడిపించుకెళ్లినట్టుగా, పాఠకుల్ని షికారుకు తీసుకెళ్తాయి. అటువంటి వ్యాహ్యాలికి సన్నద్ధమైన పాఠకులకు ఆహ్వానం పలకడం మాత్రమే నేను చేయగలిగిన పని.