GHANTARAVAM by ERNEST HEMINGWAY Telugu book cover

GHANTARAVAM

by ERNEST HEMINGWAY

₹290
In stock · 316 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
GHANTAARAAVAM ERNEST HEMINGWAY ఎర్నిస్ట్ హెమింగ్వే రచనల్లో రెండు ప్రపంచయుద్ధాల మధ్య కాలంలో మేధావులను కలచివేసిన సమస్యలూ, ఆవరించిన నైరాశ్యమూ ప్రతిఫలిస్తున్నాయి. సమకాలీన సభ్యత ఎలియట్ కవి కళ్లకి మరుభూమిగా కనిపించినట్లే హెమింగ్వే దృష్టికి శుష్కంగా, శూన్యంగా గోచరించింది. జీవితంలో కనిపించే కర్కశత్వమూ, కాలుష్యమూ విపులంగా చిత్రించాడు. వీటితోపాటు మానవులను మహిమాన్వితులను చేసే మైత్రీ, ప్రేమా, కరుణా, సంవేదన వంటి ఉత్తమాంశాలకు నివాళులు సమర్పించకపోలేదు. పనికట్టుకుని నీతిబోధ చెయ్యకపోయినా హెమింగ్వే మనిషిలోని ఉత్తమాంశాలను విస్మరించలేదు. నైరాశ్యాన్ని చిత్రించినా క్రియావాదాన్నీ, ఆదర్శ పరాయణత్వాన్నీ, సాహసోపేతమైన క్రీడాకారుని మనస్తత్వాన్నీ ప్రబోధించాడు. హెమింగ్వే రచనల్లో సుదీర్ఘమైన నవల “ఫర్ హూమ్ ది బెల్ టోల్స్”. స్పెయిన్ ఫాసిస్టులకూ, కమ్యూనిస్టులకూ జరిగిన సంఘర్షణ ఇందులోని ఇతివృత్తం. నాలుగు దినాలలో నడిచిన ఘటనలు నాలుగు వందల పధ్నాలుగు పుటలలో చిత్రించాడు. ఒక గుహలో కొద్దిమంది స్త్రీ పురుషులతో కథ నడిచినప్పటికీ మొత్తం ఉద్యమమంతా మన కళ్ళ ముందు కదులుతున్నట్లనిపిస్తుంది. ఫాసిస్టుల కిరాతక చర్యలతో పాటుగా, విప్లవకారుల అమానుష కృత్యాలు వర్ణించటంలో హెమింగ్వే ప్రదర్శించిన నిష్పాక్షిక నిర్లిప్తదృష్టి ఉత్తమ రచయితలకే సాధ్యమౌతుంది. రికారం విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004