
GHANTASALA STUPAM TAVVAKALU
by DR.EMANI SIVANAGIREDDY STHAPATI
₹25
In stock · 58 available
PublisherDR.EMANI SIVANAGIREDDY STHAPATI
LanguageTelugu
గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని వలివేరు గ్రామంలో 1955లో పుట్టిన శివనాగిరెడ్డి, తిరుపతిలోని శిల్పకళాశాలలో సాంప్రదాయ వాస్తు, ఆలయ శిల్పకళలో నాలుగేళ్లు శిక్షణ పొంది ఎస్వీ యూనివర్సిటీ నుంచి బీకాం, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చరిత్ర, పురావస్తు శాస్త్రంలో ఎం.ఎ., హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో పీహెచీ పట్టాలను పొందారు. 1978లో దేవాదాయ శాఖలోనూ, 1981 నుంచి రాష్ట్ర పురావస్తు శాఖలోనూ స్థపతిగా పనిచేసి 2013లో పదవీ విరమణ చేశారు. 2004 నుంచి 2008 వరకూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం & హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో ప్రొఫెసర్గా, డీన్గా, 2010-11లో డైరెక్టర్గా పనిచేశారు. 2013 నుంచి 2015 ఫిబ్రవరి వరకూ స్టేట్ ఆర్ట్ గాలరీ డైరెక్టరుగా, ఆంధ్రప్రదేశ్ శిల్పారామం ప్రత్యేకాధికారిగా పనిచేశారు. 2015 మార్చి నుంచి మాలక్ష్మీ గ్రూప్కు చెందిన ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ సీఈవోగా పనిచేస్తున్నారు. చరిత్ర, శాసనాలు, పురావస్తు శాస్త్రం, పర్యాటకం, బౌద్ధం .... వీటిపై అనేక పుస్తకాలు రాశారు. శ్రీశైలం జలాశయం ముంపుకు గురైన క్రీ.శ.7-17 శతాబ్దాలకు చెందిన 100కు పైగా దేవాలయాలను తొలగించి, ఎగువన పునర్నిర్మించారు.