
GHATODGAJAPURAM GATHALU
₹45
In stock · 757 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఉపక్రమణిక... సమాజంలో సగటు మనిషి నవ్వడం మరచిపోతున్నాడు. ఎవరైనా మనస్పూర్తిగా నవ్వడం మొదలుపెట్టినా ప్రక్కవాళ్ళు ఆ నవ్వును నిర్ధాక్షిణ్యంగా చెరిపివేస్తున్నారు. నవ్వుకు దూరమైన మనిషి ప్రేమించే గుణాన్ని కోల్పోయి సాటి మనిషినుండి మరింత దూరాన్ని పెంచుకుంటున్నాడు. ఇలా జరగడానికి మనిషిలో మనిషితనం తరిగిపోవడానికి సామాజిక, ఆర్థిక పరమైన కారణాలు ఎన్నివున్నా అతిముఖ్యమైన, కారణాలుగా మాత్రం రెండింటిని పేర్కొనవచ్చు. మొదటిది... కొద్దిమంది మనుషుల మనసులలో చోటు చేసుకుంటున్న భేషజం, తాము గొప్పవాళ్ళమన్న భావం, నాయకత్వ లక్షణాలు కలిగివున్న తమకే అన్నీ తెలుసుననే అహంకారం... కాగా... రెండవది... చాలామంది మనుషులలో బలపడిపోతున్న తాము తక్కువ వాళ్ళమన్న అభిప్రాయం! తమకేదీ తెలియదనే ఆత్మన్యూనత!!... పైగా అశక్తులమైన తమకు ప్రమాదమేదో వెన్నంటే ఉందనే అభద్రతాభావం! ఏది ఏమయినా మనిషి ఇలా నవ్వుకు దూరం కావడం మాత్రం మంచి పరిణామం కాదు. నవ్వుకు మనిషిని చేరువ చెయ్యగల ప్రక్రియలలో అతిముఖ్యమైనది. సాహిత్యం. మనిషిని ఉల్లాసపరచి, ఉత్తేజం కలిగించి అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, అవధులు లేని శక్తినీ, నూతనోత్సాహాన్నీ కలిగించగలదు మంచి సాహిత్యం. సాహిత్యంలోని వ్యంగ్య, హాస్య రచనలయితే మరింత శక్తివంతంగా మనిషిని ఆహ్లాదపరచి ముందడుగు వేయించగలుగుతాయి. అలాంటి ప్రయత్నమే ఈ “ఘటోద్గజపురం గాథలు" అనునిత్యం మన కళ్ల ఎదుట కదులుతూ తమ తమ ప్రవర్తనల వ్యంగ్య వైభవాలతో మనల్ని నవ్వించి, కవ్వించి, కదిలించి... ప్రేమించే గుణానికి చేరువ చెయ్యగలిగిన అసాధారణమైన శక్తిని కలిగివున్నవే ఇందులోని సాధారణ పాత్రలు....