
GHEE LOLLILO NIJAMUNDI
₹25
In stock · 9 available
PublisherRAASA BHUMAIAH
LanguageTelugu
నామాట 1832 సెప్టెంబర్ 2న లార్డు బెకాల్ లండన్లో బ్రిటీష్ సభను ఉద్దేశిస్తూ, ఇండియా చాలా సంపన్నదేశం, దానిని జయించాలంటే మనకు ఆయుధాలు చాలవు. మనం విద్యావిధానం ప్రవేశపెడితే వాళ్లు తమ అస్తిత్వాన్ని కోల్పోతారు. వాళ్లు అప్పుడు బానిసలవుతారు అని సూచించారు. 1852 రాజమండ్రిలో “ఉడ్వర్డ్ డిస్పాచ్” అనే ఇంగ్లీష్ సిలబస్ ప్రవేశపెట్టినారు ఆనాటి మెకాలె. అలాంటి ఆలోచనతోనే కావచ్చు మనభాషయాస ఒక్కటేనంటు కల్లబొల్లి మాటలు చెప్పి సీమాంధ్రవాళ్లు తెలంగాణాను 1956 నవంబర్ 1న ఆంధ్రలో కలిపేసుకున్నట్లు అర్ధమవుతుంది. వాళ్ల మాటలకు మోసపోయి 50 ఏండ్లనుంచి తెలంగాణలోని సంస్కృతి. సాంప్రదాయం మొత్తం ఆస్తిత్వమే కోల్పోయినం. అణిచివేత ఉన్నంతకాలం తిరుగుబాటు కొనసాగుతూనే ఉంటుంది. విప్లవ జ్వాలలు రగులుతూనె ఉంటవి. 1997 నుంచే తెలంగాణ రాష్ట్రం విషయంలో కొంతకొంత తెలుసుకుంటున్నాను. తెలంగాణ మేధావులు అప్పుడప్పుడు అవగాహన సదస్సులు పెట్టినప్పుడు ఆ సదస్సులకు హాజరవుతుండేవాడ్ని. అలా చాలాసార్లు సభలు సమావేశాలకు పోవడం వలనా తెలంగాణమీద నాకు కొంత అవగాహన కలిగింది. 2008లో "తెలంగాణ గోస" అనే పుస్తకంకూడా వ్రాసినాను. తెలంగాణాకు సంబంధించిన పాటలుకూడా వ్రాసినాను "ప్రజాకేతనం" గేయ సంపుటి పుస్తకం ఫిబ్రవరి 2010న ప్రజా గాయకురాలు విమలకా చేతులమీదుగా ఆవిష్కరింపబడింది. 2009 నవంబర్ నుంచి తెలంగాణ ఉద్యమంలో పూర్తిగా పాల్గొంటు సందర్భాన్నిబట్టి ఒక్కొక్క అంశంమీద అధ్యయనంచేస్తు కరపత్రాలు వ్రాసి ప్రచురిస్తు తెలంగాణ ప్రజలకు అందజేసినాను. యుద్ధం చేయడం ఎంత ముఖ్యమో అందుక మెలకువలు తెలుసుకోవడం ఇంకా ముఖ్యం. చరిత్ర తెలుసుకుంటేనే వాస్తవాలు తెలుస్తవి మనిషిలో చైతన్యం వస్తుంది. అప్పుడు జనాలను జాగృతి పరచేందుకు సులువుగా ఉంటుంది. చేసే ఉద్యమ పోరాటాలు కూడా బలంగా ఉంటవి.