
GIRISH KARNAD
₹80
In stock · 1 available
PublisherDR.BHARGAVIRAO
LanguageTelugu
నా నేపథ్యం.... సాహిత్య ప్రక్రియల్లో నాకు నాటకాలంటే మక్కువ. క్లాసులో విద్యార్థులకు విశ్లేషించడమన్నా, ప్రదర్శనలు చూడటమన్నా సరదాగా అనిపిస్తుంది. గట్టిగా చెప్పుకోవాలంటే నాటకాలకే సామాజిక ప్రయోజనం ఎక్కువ నవలలు చదవటానికి తీరికా, ఓపికా ఉండాలి. కవితలను ఆస్వాదించాలంటే మంచి భాషా పరిజ్ఞానం, భావుకత ఉండాలి. కానీ నాటక ప్రదర్శనను చూసి సంతోషించటానికి చదువు రావాలన్న నియమం లేదు. అందరూ తమకు తెలిసిన భాషలో నాటకాలను చూడొచ్చు. ప్రముఖ వైజీరియన్ నాటక కర్త, వొలేసాయింకా "మనం సమాజంలో విప్లవం తేవటానికి రంగస్థలాన్ని ప్రభావితంగా ఉపయోగించుకోవాలి" అని అంటారు. మన దేశ చరిత్రలో ఎన్నో ఉద్యమాలకు నాటకాలు శ్రీకారం చుట్టాయంటే అతిశయోక్తి కాదు. సామాజిక సమస్యలను ఎత్తి చూపే నాటకాలు కొన్నయితే, కొత్త కోణంలో, సమకాలీన ప్రయోజనాలతో రూపు దిద్దుకున్నవి మరికొన్ని. రెండవ కోవలోకి వచ్చే నాటక రచయిత శ్రీ గిరీశ్ కర్నాడ్. మంచి కళాకారులు, ప్రతిభావంతులూ అయిన కర్నాడ్ గారు రచించిన ఆరు నాటకాలను యయాతి, హయవదన, తుగ్లక్, నాగమండల, తలెదండ, అగ్ని వర్షం నేను తెలుగు చేసి ప్రచురించాను. కొన్ని నాటక సంస్థలు ప్రదర్శించాయు కూడా. ఈ అనువాదాలు నాకు తెలుగు సాహిత్యంలో ఒక గుర్తింపూ. కొన్ని అవార్డులనూ తెచ్చిపెట్టాయి. ఆ ఉత్సాహంతోనే గిరీశ్ కర్నాడ్ గారి నాలుగు కొత్త నాటకాలను అనువదించాను - మీ ఆదరాభిమానాలను ఆశిస్తూ...