
GLACIER
₹100
In stock · 4 available
PublisherMANTHA PUBLICATIONS
LanguageTelugu
నామాట 'గ్లేషియర్' నా తొలి నవల. ఒక రోజు యథాలాపంగా రచన మాసపత్రిక తిరగేస్తుంటే కనిపించింది, విశ్లేషణాత్మక నవలల పోటీకి ఆహ్వానం. ప్రయత్నిద్దామా అని ఒక్కక్షణం అనిపించింది. మొదటి సారే పోటీలకా... అదీ అంత బహుమమతికి... (శ్రీమతి నర్మిపురం ఆదిలక్ష్మి స్మారక పోటీలు... రూ.70,000/- ముగ్గురికి...), మరీ అతిగా పోతున్నావేమో అని అంతరాత్మ హెచ్చరించింది. సర్లే... బహుమతి వస్తుందా ఏమిటి? అనుభవం అయినా వస్తుంది కదా అని సాహసం చేద్దామని అనిపించింది. ఎందుకైనా మంచిదని సమాచారం సేకరించడం మొదలు పెట్టాను. అప్పుడప్పుడే క్రూజ్లో వెళ్లిన అనుభవం ఎందుకు ఉపయోగించుకోకూడదూ అనిపించింది. తొమ్మిది నెలలు... అన్ని రోజులు సమయం ఉంటే కూడా రాయడం కష్టమే. రోజూ కొంచెంసేపు బల్లదగ్గిర కూర్చోడం, లేవడం... మధ్యలో నిరుత్సాహం. ఎలాగయితేనేం పూర్తి చేసి ఇచ్చి దాని గురించే మర్చిపోయాను. ఒకరోజు రచన శాయిగారు ఫోన్ చేసి బహుమతి వచ్చిందని చెప్తే ఎవరెస్టు శిఖరం ఎక్కినంత సంబరం! ముందు మాటలో వసుంధరగారు రాసినట్లు ఇంగ్లీషుమాటలు, పదాలు ఎక్కువ వాడానని పత్రికలో నవల వస్తున్నప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. నిజమే... దానికి రెండు కారణాలు. ఒకటి-ఇది నా మొదటి నవల కావడం, ఆలోచన ఎలా తడితే అలాగే కాగితం మీద పెట్టెయ్యడం. రెండోది- నవలా వస్తువు ప్రపంచంలోని అన్ని భాషల వాళ్లూ ఉండే ఓడ కావడం. పాత్రలు కూడా వివిధ దేశాల వారూ అవడం. అయినా కథకురాలిగా కూడా ఆంగ్లపదాలు ఎక్కువే వాడినందుకు కొంచెం అసౌకర్యంగానే ఉంది. అక్కడికీ నవల ప్రచురిస్తున్న సమయంలో నాకు తోచినవి కొన్ని మార్చాను. ఈ నవలకి బహుమతినిచ్చి ప్రోత్సహించిన రచన పత్రికవారికి, ఆదరించిన పాఠకులకు ధన్యవాదాలు. ఇంతకుముందు అనంతవాహిని, రామాయణం మామయ్య- పుస్తకాలను శ్రద్దతీసుకుని ప్రచురించిన 'పుస్తకశిల్పి' శ్రీ తాళ్లపల్లి మురళీధరగౌడుగారే ఈ నవలనూ ప్రచురించడం నాకు సంతోషాన్ని కలిగించే విషయం. వారికీ, డి.టి.పి. చేసిన శ్రీ కొండయ్యగారికి, చక్కటి ముఖచిత్రాన్ని రూపొందించిన శ్రీ టి. మల్లేశ్ గార్లకి, ముచ్చటగా ముద్రించిన కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్ అధినేత శ్రీ జగన్మోహన్రెడ్డిగారికి కృతజ్ఞతలు. ఈ పుస్తకంలో ప్రచురించేందుకు ప్రభుత్వ ప్రకటన విడుదల చేసి సహకరించిన ఆం.ప్ర. ప్రభుత్వ సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్గారికీ ధన్యవాదాలు. మంథా భానుమ