
GLOBAL SANDARBHAMLO NAGNAMUNI KOYYAGURRAM
₹50
In stock · 1 available
PublisherKALLURI BHASKARAM
LanguageTelugu
కొయ్యగుర్రం కావ్యం నగ్నముని 1977 నవంబరు చివర్లో రచించారు. నాటి సందర్భం దివిసీమ పెను ఉప్పెన. గ్రామాలకు గ్రామాల జలసమాధి. శవాలుగా మారిన జనం. ప్రకృతి ప్రళయబీభత్సం. కకావికలైన జీవితం. మరొకవైపు ప్రభుత్వం, వ్యవస్థలు ప్రదర్శించిన అలసత్వం, అమానుషత్వం. కొయ్యగుర్రం 1980 మొదట్లో మొదటిసారి గ్రంథరూపంలో వెలువడింది. చేరా- తొలి ఆధునిక మహాకావ్యంగా ప్రకటించారు. మరి కొందరు సజీవకావ్యంగా, అధునికానంతర తొలి కావ్యంగా అభివర్ణించారు. నాటి నుండి నేటి వరకు చర్చోపచర్చలు, వ్యాఖ్యానాలు వెలువడుతూనే వున్నాయి. బహుశా ఆధునిక కావ్యాలలో యింతటి చర్చ, విశ్లేషణ జరిగిన కావ్యం మరొకటి లేదు. కాలమూ సునామీ వంటిదే. కొత్త సందర్భాలను తోసుకు వస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తూనే వుంటుంది. స్వీకరించడానికి, తన స్వీయాభివృద్ధికి వుపయోగించుకోడానికి మానవాళి ఎంతవరకు సంసిద్ధంగా వున్నదో పరోక్షంగా పరీక్ష పెడుతూనే వుంటుంది. వేటి శాస్త్రసాంకేతిక విజ్ఞాన ఆవిష్కరణలోని భాగమైన ప్రపంచీకరణ కూడా అటువంటి పెను సందర్భమే. కల్లూరిభాస్కరంగారు ప్రత్యామ్నాయ ఆలోచనాసరళిలో అరుదైన మేధావి. కొయ్యగుర్రంలోకి ప్రవేశించి, కాలికస్పృహ కోణం నుండి 'గ్లోబలైజేషన్ సందర్భంలో వర్తముని కొయ్యగుర్రం' గ్రంథం రచించారు. కొయ్యగుర్రపు జడత్వం చరిత్రలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ రంగంలో, ఏ రూపంలో, ఏ తీరాల్లో చోటు చేసుకుంటూ వస్తున్నదో క్లుప్తంగా, గాఢంగా విశ్లేషించారు. ఈ స్పృహ, ఆగిపోయిన ప్రయాణాన్ని తిరిగి కొనసాగించే దిశలో, ఎంతవరకు వుపయోగపడినా సంతోషమే. కల్లూరి భాస్కరంగారు యీ గ్రంథ ప్రచురణ అవకాశం మాకు యిచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాం.