GLOBAL WARMING by T.V.SUBBAIAH Telugu book cover

GLOBAL WARMING

by T.V.SUBBAIAH

₹90
In stock · 2 available
PublisherDEEPTHI BOOK HOUSE
LanguageTelugu
ముందుమాట పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలు అనేక వస్తువులను తయారు చేయటం, అనేక నిర్మాణాలు చేపట్టడం, విస్తృతంగా పెరుగుతున్న రవాణా వాహనాలు అన్నీ కలిపి మన పర్యావరణాన్ని సమూలంగా మార్చి వేస్తున్నాయి. రసాయన పరిశ్రమలే ఒక మిలియన్ కు పైగా రకరకాల ఉ త్పత్తులు చేస్తున్నాయంటే మనం ఆశ్చర్యపోనక్కరలేదు. ఒక్క 20వ శతాబ్దంలో జరిగినంత 'పర్యావరణ హాని' ముందు తరాల్లో జరగలేదని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఒక్క విషయం మనం గమనించాల్సింది ఏమంటే కాలుష్యం ఎక్కడ జరిగినా దాని ప్రభావం మెత్తం భూమండలమంతా వ్యాపిస్తుందనటానికి మన దగ్గర అనేక ఉదాహరణలు వున్నాయి. వీటిలో మెదట చెప్పుకోదగింది భూతాపం పెరగటం. ఎక్కడో భూ మధ్య రేఖకు అటూ ఇటూగా విడుదలయిన విషవాయువులన్ని భూమండలమంతా వ్యాపించి భూతాపాన్ని పెంచటం, రక్షణ పొర అయినటువంటి 'ఓజోన్' పొరను హరించి వేయటం మనం గత అయిదు దశాబ్దాలుగా చూస్తూనే వున్నాం. అయితే ప్రపంచమంతా ఒప్పుకున్న విషయం ఏంటంటే ఈ తరహా కాలుష్యంలో అభివృద్ధి చెందిన దేశాల వాటా అభివృద్ధి చెందని, చెందుతున్న దేశాల వాటా కంటే అనేక రెట్లు అధికం. అభివృద్ధి చెందిన అతి కొద్ది దేశాలు బాధ్యతారాహిత్యంతో కొన్ని శతాబ్దాల పాటు విడుదల చేసిన హానికర విషవాయువులు