
GLOKAL VILLAGE
₹60
In stock · 61 available
PublisherVELCHERU CHANDRA SEKHAR
LanguageTelugu
గ్లోబల్ విలేజి అంటే మొత్తం ప్రపంచాన్ని కొత్త కొత్త ఎలక్ట్రానిక్ సంచార సాధనాల ద్వారా దగ్గర చేస్తూ లేదా కలుపుతూ, వొకదానిమీద వొకటి లేదా వొకరి మీద వొకరు సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఆధారపడి బతికే రోజువారీ బతుకుల్నే గ్లోబల్ విలేజర్స్ అని, వారు అలా నివసించాలని శాసించే పరిస్థితులు కల్పించబడిన ప్రతి పట్నాన్ని గ్లోబల్ విలేజ్ అని అనవచ్చు. అయితే గ్లోబల్ గా ప్రకృతులు వికృతులు ఉన్నయ్. ప్రకృతుల్లో విలువైన చదువు, వికృతుల్లో అమ్మకానికి చదువు, ప్రకృతుల్లో నైతికంగా డబ్బు, వికృతుల్లో “దొనెంబరీ”. ఇలా గ్లోబల్ లోకల్ కలిసి గ్లోకల్ అవుతుంది. గ్లోబల్ వాల్యూస్ని లోకల్గా ఆపాదిస్తే అది గ్లోకల్ అనుకోవచ్చు. అంటే గ్లోబల్గా సెక్స్ అత్యవసర వస్తువు అయితే లోకల్ గా దాన్ని ఇన్టీసెంట్గా ఎలా ఏర్పాటు చేసుకోవాలి! అవసరం ఎలా తీర్చుకోవాలి... అవసరానికే కాదు అదో సరదా అవుతుంది. వృత్తిలో బైట పెట్టుకునే ప్రవృత్తి కూడా కావచ్చు! ఈ కొత్త వాల్యూ డెవలప్ అయిన చోటుని గ్లోకల్ విలేజ్ అనవచ్చు. అదన్నమాట ! అలాగే ఇంగ్లీష్ గ్లోబల్గా గా ఎంత అవసరమో, లోకల్గా ఇంగ్లీషు స్కూలు నడిపేవాడికి తెలుస్తుంది. గ్లోబల్గా రియల్ ఎస్టేటు ఇండస్ట్రీస్ పెరుగుదల కావాలి. అన్నింటికి మించి సంస్కృతి ఎలా మారిపోతుంది అన్నది అర్ధంకాకుండానే మారిపోతుంది. ఎందుకంటే కొన్ని దేశాలతో మనం పోటీపడాలి. లోకల్గా వాటి విలువలు పెంచి వాటిని సాధించడానికి (అర్బనైజేషన్) పట్టణీకరణాల్ని