GLOSSARY OF SOCIAL SCIENCE RESEARCH METHODOLOGY by P.NARASIMHARAO Telugu book cover

GLOSSARY OF SOCIAL SCIENCE RESEARCH METHODOLOGY

by P.NARASIMHARAO

₹60
In stock · 5 available
PublisherP.NARASIMHARAO
LanguageTelugu
ప్రొఫెసర్ జి. శ్రీనివాసరెడ్డి ముప్పయి మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ పాలన మరియు మానవ వనరుల నిర్వహణ విభాగములో బోధన చేస్తున్నారు. ప్రజా మరియు ప్రభుత్వ పాలనా సంబంధమైన అంశాలపైన పరిశోధనలుచేసి, 6 పుస్తకాలను, సుమారు 52 వ్యాసాలను వ్రాసారు. అంతేగాక వీరి పర్యవేక్షణలో అనేకమంది పరిశోధక విద్యార్థులు పిహెచ్.డి., యం.ఫిల్. డిగ్రీలనుపొందారు. అనేక సెమినార్లను నిర్వహించడమేగాక, పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు. కెనడా, అమెరికా, నేపాలు దేశాలలో పర్యటించారు. ఇంతకుముందు ఉస్మానియా విశ్వవిద్యాలయం, ISEC బెంగళూరులో, కంకార్డియా విశ్వ విద్యాలయంలో (మాంట్రియల్, కెనడా) విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేసారు. ప్రభుత్వ పాలనా విభాగపు అధ్యక్షుడుగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మెన్, డీన్, సోషల్ సైన్సెస్, పరీక్షల నియంత్రణాధికారిగా, రిజిస్ట్రార్గా పనిచేసారు. ప్రస్తుతం ప్రభుత్వ పాలనా మరియు మానవ వనరుల నిర్వహణ శాఖలో ప్రొఫెసర్గా మరియు యూనివర్సిటీ ఆర్ట్స్ సైన్స్ కాలేజి ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. డా॥ పి. నరసింహారావు ఇరవై సంవత్సరాలుగా ప్రభుత్వ పాలన మరియు మానవ వనరుల నిర్వహణ విభాగములో బోధన చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి మరియు ఇతర సామాజిక అంశాలపై పరిశోధనలుచేసి 1 పుస్తకము, సుమారు 20 వ్యాసాలను ప్రచురించారు. వయోజన- నిరంతర విద్యా మరియు విస్తరణ కేంద్రానికి ప్రోగ్రాం ఆఫీసర్గా, జాతీయ సేవా పథకము ప్రోగ్రాం ఆఫీసర్గా, ప్రతాపరుద్ర మరియు గణపతిదేవ హాస్టల్స్క వార్డెన్గా పనిచేసారు. ప్రస్తుతం ప్రభుత్వ పాలనా మరియు మానవ వనరుల నిర్వహణ శాఖ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అశోకకృష్ణ, వరంగల్, ఫోన్: 2427404