
GNANA GULIKALU
by BHAMIDIPATI BALATRIPURASUNDARI
₹50
In stock · 11 available
PublisherSRI MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
బాలబాలికలకి ఆశీస్సులు! నేనెవరో తెలుసుకోవాలని ఉందా ? మీకు స్నేహితురాల్ని. నన్ను చూడలేదు కదూ. ఈ పుస్తకంలో ప్రతి అక్షరంలో నేను ఉన్నాను. కనిపించడం లేదా... మీకు దేవుడు కనిపిస్తున్నాడా ? లేదుకదా ! మీ పాఠపుస్తకాల్లో దేవుళ్ళు, రాజులు, మహర్షులు రాక్షసులు, దేశభక్తులు, గురువులు ఇలా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు మీకు కనిపిస్తున్నారా ? లేదు కదా ! చూడకపోయినా వాళ్లందరూ మీకు తెలుసు. ఎలా తెలుసు ? వాళ్ళందర్నీ మీకు ఎవరు చూపిస్తున్నారు ? నేను చెప్పనా ? మీకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయలు ! వాళ్ళు కూడా అందర్నీ చూడలేదు కదా... మరి మీకు ఎలా చెప్పగలుగుతున్నారు. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇటువంటి పుస్తకాల ద్వారా చెప్పడం వల్ల వాళ్ళు తెలుసుకుని మీకు తెలియచేస్తున్నారు. అంతేకాదు. ఉపాధ్యాయులకంటే ముందే మీతో ఆటలు, పాటలు, మాటలు, పద్యాలు, శ్లోకాలు చెప్పిస్తూ కథలు చెప్తూ వీళ్లందర్నీ పరిచయం చేసినవాళ్ళు. మరొకళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళెవరో చెప్పగలరా? మీరు చెప్పలేరు. నేనే చెప్తున్నాను. మీ తల్లిదండ్రులు అంటే, అమ్మా నాన్నలు! వీళ్ళు కూడా పెద్దవాళ్ళు చెప్పిన కథలు విని, మంచి పుస్తకాలు చదివి నేర్చుకుని మీకు చెప్తున్నారు. మీ పిల్లలందరు ఏం చేయాలి అంటే, మీ మంచి భవిష్యత్తు కోసం, మంచి సమాజం ఏర్పరచడం కోసం అమ్మ భాషలో నా వంటి వాళ్ళు మీకోసం అందిస్తున్న పుస్తకాలు చదివి జ్ఞానం సంపాదించాలి. మీకు అటువంటి పుస్తకాలు అందించడం కోసం ఎంతోమంది కృషి చేస్తున్నారు. వాళ్ళ కష్టానికి తగిన ఫలితమూ ఉంటుంది. నవ్య సమాజాన్ని ఏర్పరచిన ఘనత మీకూ దక్కుతుంది. జీవితానికి చదువు ఎంత ముఖ్యమో, నడవడిక కూడా అంతే ముఖ్యం. జీవితానికి పాఠ్యపుస్తకాలు ఉపయోగిస్తే, మంచి మార్గంలో జీవించడానికి మంచి కథల పుస్తకాలు ఉపయోగిస్తాయి. రేపటి తరానికి మీరే మార్గదర్శకులు అవుతారు. ఈ పుస్తకాన్ని ప్రచురణలోకి తీసుకుని రావడానికి సహృదయంతో ముందుకు వచ్చి సహకరించిన శ్రీ తోట చక్రవర్తిగారికి, శ్రీ బావులూరి చరణ్ సాయికుమార్గారికి, ఇమ్మిడి ద్వారకనాథ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. బాలలకోసమే కాదు. రేపటి తరాన్ని తీర్చిదిద్దవలసిన తమవంటి చిన్న తల్లిదండ్రులకి కూడా ఇటువంటి పుస్తకాల అవసరం ఉందని, ఇటువంటి కథలు చదివి తమ పిల్లలకీ మంచి నడవడిక, క్రమశిక్షణ నేర్పడానికి తోడ్పడతాయని, ప్రతినిత్యం రాంకుల కోసమే పోరాడిన తమ తరం అమ్మ బాషకి, సాహిత్యానికి, సంస్కృతి సంప్రదాయాలకి, జన్మభూమికి దూరంగా ఉందని, ఇంకా ఇటువంటి పుస్తకాలు రావాలని కోరుకుంటున్నాని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వారి కుటుంబాలకి నా ఆశీస్సులు అందచేస్తున్నాను.