GNANADARSHINI by S.R.BHALLAM Telugu book cover

GNANADARSHINI

by S.R.BHALLAM

₹100
In stock · 40 available
PublisherS.R.BHALLAM
LanguageTelugu
మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు.? నిజంగా మనిషిని దేవుడు సృష్టించాడా? అసలు దేవుడనేవాడు ఉన్నాడా.? ఉంటే ఎక్కడ ఉన్నాడు.? ఏ రూపంలో ఉన్నాడు? మనిషికి జ్ఞానం ప్రసాదించింది దేవుడేనా? మనిషి పుట్టుకలోని అంతరార్ధం ఏమిటి.? మనిషి మరణానంతరం ఏం జరుగుతుంది.? మనిషికి తెలియని మరో ప్రపంచం ఉందా.? ఒకవేళ ఉంటే అది ఎక్కడ ఉంది.? ఇలాంటి ప్రశ్నల పరంపర గురించి అన్వేషణ అనుక్షణం నా అంతరంగంలో సాగుతూనే ఉంటుంది. అలాటప్పుడు అంకురించిన ఆలోచనలకు అక్షరరూపమే ఈ జ్ఞాన దర్శిని. ప్రతి మనిషికి రెండు ప్రపంచాలు ఉంటాయి. అది లౌకిక ఊహా ప్రపంచ మైనా కావచ్చు. అలౌకిక ఆధ్యాత్మిక ప్రపంచమైనా కావచ్చు. ఆధ్యాత్మిక సాధనలో రాజయోగం ముఖ్యమైంది. ఆ మార్గంలో పయనిస్తూ, అలౌకిక అనుభూతుల్ని పొందడానికి, ప్రాణాయామ ప్రక్రియద్వారా, దేహంలో నిద్రాణమై ఉన్న కుండలినీశక్తిని ప్రకోపింపచేసి, షట్చక్రాలను ఛేదిస్తే, ఆశక్తి ఎప్పుడైతే సహస్రారానికి చేరుతుందో, అప్పుడు సమాధిస్థితి పొంది అనంత ఆనందం అనుభవైకవేథ్యం అవుతుంది. అదే జ్ఞానదర్శిని అర్ధం..! పరమార్థం..!! అంతరార్ధం.!!! ఎస్. ఆర్. భల్లం