
GNANODAYAM KATHALU -70.00
₹70
In stock · 689 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
పోటీ మనస్విని సినిమా థియేటరులో మొదటి ఆట ప్రారంభమైంది. అయిదు నిమిషాలు లేటుగా అయానపడుతూ వచ్చిన ఓ ఆసామీ సైకిలుకు నంబరు వేసి, డబ్బులు తీసుకొని రసీదు ఇచ్చాడు మంగపతి. అతడా రసీదు అందుకుంటూనే ఏదో మించిపోయినట్టు హడావిడిగా బుకింగ్ కౌంటరువైపు పరిగెత్తాడు. గంగులు ఆ ఆట కొచ్చిన సైకిళ్ళన్నింటినీ ఒక క్రమంలో పెడుతూంటే తనా రోజు చింపిన రసీదు లెన్నో పుస్తకంలో ఓ మారు చూసుకొని తర్వాత సైకిళ్ళెన్నో లెక్కపెట్టాడు మంగపతి. లెక్క సరిపోయిందని ధ్రువపడ్డాక సైకిల్ స్టాండ్ లోంచి బయటికొచ్చి, థియేటర్ ఎదురుగా ఉన్న దిబ్బమ్మ టీ కొట్లో టీ త్రాగి, ఆ ప్రక్కనే ఉన్న పాన్ షాపులో సిగరెట్ తీసుకొని కాలుస్తూ కాస్సేపక్కడే నిలబడ్డాడు. మంగపతి లోపలి కొచ్చేసరికి ఆ హాలు మేనేజరు రంగరాజు సైకిల్ స్టాండ్ ఆవరణలో అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు, అతణ్ణి చూస్తూనే మంగపతి మనసు కీడును శంకించింది. వ్రేళ్ళ మధ్య నున్న సిగరెట్ దూరంగా విసిరి తొందరగా అతడి ముందు కెళ్ళి "నమస్కారం సార్" అన్నాడు వినయంగా. అతడి నమస్కారాన్ని ఏమాత్రం పట్టించుకోకుండానే "చూడు మంగపతీ! ఈ నెలాఖరున సైకిల్ స్టాండుకు పాట పెడుతున్నాం. ఇక నుంచి అద్దె పద్ధతి తీసివేయమని ప్రొప్రయిటర్గారు చెప్పారు. రేపు జరగబోయే పాటలో నువ్వుకుడా పాల్గొంటానంటే మాకేం అభ్యంతరం లేదు" అన్నాడు రంగరాజు.