
GNAPAKALA CHEDA BOKKENA
₹90
In stock · 95 available
PublisherDR.VANI DEVULAPALLI
LanguageTelugu
చెమ్మగిల్లే పాట దేవులపల్లి ఇంటి పేరు చూడగానే దేశమంతటా పీడిత ప్రజలకు డి.వి.గా సుప్రసిద్ధుడైన దేవులపల్లి వెంకటేశ్వరరావు గుర్తుకొస్తాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన ప్రజాసేనాని. మలి తెలంగాణ విప్లవ పోరాటంలో ఆయనది డి.వి. పంథా. విప్లవ సిద్ధాంత కర్తగా ఆయనకున్నంత సుదీర్ఘ జీవితానుభవం కమ్యూనిస్టు నాయకుల్లో ఎవరికీ వుండదు. ఆయనది నల్లగొండ జిల్లా. దేవులపల్లి ఇంటిపేరు చూడగానే తెలుగు సాహిత్యలోకంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి పేరు అందరి నాలుకల మీద నడయాడుతుంది. శ్రీశ్రీని కూడ ప్రభావితం చేసిన భావకవిత ఉద్యమ నాయకుడు. కవి అంటే కృష్ణశాస్త్రి అని పర్యాయపదంగా దశాబ్దాల పాటు చెలామణి అయిన పేరు. కవిత్వ రహస్యం తెలిసిన కవిగా తిలక్ పేర్కొన్న దేవులపల్లి కృష్ణశాస్త్రిది పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. ఆయన కవి మాత్రమే కాదు, రఘుపతి వెంకటరత్నం ప్రభావంతో బ్రహ్మ సమాజాన్ని స్వీకరించిన సంస్కరణోద్యమ నాయకుడు కూడా. హైదరాబాదును అయితే, తెలంగాణలో నైజాం ఫ్యూడల్ పరిపాలన కాలం నుంచి గ్రంథాలయోద్యమ కాలం నుంచి ఇంకొక దేవులపల్లి కుటుంబం పేరు కూడా వరంగల్ నుంచి తెలంగాణలోనే కాదు తెలుగు సమాజంలోనూ సుపరిచితమైంది. అది దేవులపల్లి రామానుజరావు గారి వంశం. బొల్లికుంట నుంచి హైదరాబాద్ దాకా రాజకీయ సాహిత్యోద్యమాల ద్వారా తీగ సాగిన వంశం. రామానుజరావు గారి తండ్రి, దేవులపల్లి వేంకట చలపతిరావు గారు జాగిర్దార్ అయినప్పటికీ జాతీయోద్యమ ప్రభావంతో వరంగల్లులో రాజకీయ, సాహిత్య చైతన్యానికి తోడ్పడినవాడు; పండితుడు; కవి.