
GNAPAKALA PANDIRI
₹100
In stock · 3 available
PublisherVIJAYA PUBLICATIONS
LanguageTelugu
శ్రీ బి.నాగిరెడ్డి గారి జీవిత అనుభవాలను ఆయన మాటల్లోనే ఏర్చికూర్చిన వ్యాస సంకలనమే ఈ 'జ్ఞాపకాల పందిరి'! తను పుట్టి పెరిగిన గ్రామం, తనకు సంప్రదాయ విలువలు నేర్పిన అక్కడి పెద్దల స్వభావాలు; స్వాతంత్య్ర స్ఫూర్తితో ఊరూరూ తిరిగి అమ్మిన ఖద్దరు బట్టలు; చేసిన ఉల్లిపాయల వ్యాపారం, యువప్రాయంలోనే రంగూన్ లో ఒక పేద కుటుంబానికి అందించిన సాయం; ప్రెస్సుతో పాటు స్థాపించి నిర్వహించిన పత్రికలు, నిర్మాతగా నిర్మించిన అపురూప చిత్రాలు; స్టూడియో అధినేతగా సాధించిన విజయాలు... ఉదాత్త మైత్రికి ఆదర్శంగా నిలిచిన చక్రపాణి; అత్యంత ఆదరాభిమానాలు కనబరచిన ఎంజిఆర్, ఎన్ టిఆర్; ఎదుటివారిలోని మంచినీ, శక్తిసామర్ధ్యాలనూ అభినందించి ప్రోత్సహించిన ఎస్.ఎస్.వాసన్... ఇలా పుస్తకం ఆద్యంతం మంచిని గురించీ, మంచి వారిని గురించీ ప్రస్తావించే జ్ఞాపకాల సుమాలు పాఠకుల హృదయాలలో మానవతా పరిమళాలు వెదజల్లుతాయి! ఉప్పొంగే ఉత్సాహాన్ని కలిగిస్తాయి!!