GO VILAAPAM by DR.N.GOPALA KRISHNA Telugu book cover

GO VILAAPAM

by DR.N.GOPALA KRISHNA

₹60
In stock · 1 available
PublisherDR.N.GOPALA KRISHNA
LanguageTelugu
'గో' విలాపం 'గో అంటే గోవు, 'గో' అంటే భూమి. ఈ రెండింటినీ మనం హింసిస్తూ వుంటే, మనం వాటిని హింసిస్తున్నామని, మనపై ద్వేషం లేదు. పగ సాధించడం లేదు - పైగా ఆ రెండు మనలను గురించి విలపిస్తున్నాయి. అవి మనలను గురించి విలపిలుస్తూ ఉంటే మనం వాటి గురించి మనం ఏమాత్రం ఆలోచించడం లేదు. అదే మన దౌర్భాగ్యం శ్రీ కృష్ణుడు, క్రీస్తు ప్రభువు అందరూ కూడా ఇతరులు యాతనపడుతూ ఉంటే వారి పట్ల దయ చూపుతారు. అలాగే గో మాత కూడా. గోవుకి భారత దేశంలో అధిక ప్రాముఖ్యత వుంది. అంతేకాదు, గోవు గురించి దేశ విదేశాలలో కూడా అధికంగా అవగాహన ఉంది. గోవు విశ్వమాత -భూమి విశ్వమాత. సమస్త దేవతలకు నిలయమైనది గోవు. అంతే కాకుండా కాలుష్య నివారణకు, గ్లోబల్ వార్మింగ్ను నివారించడానికి, ఆయుర్వేదంలో ఉపయోగించే పంచగవ్యాలనిచ్చి మనకు ఉపయోగపడేది గోవు. కుల, మత బేధాలు లేకుండా ఈ విషయాలను అందరూ అంగీకరిస్తారు. గోదానం చేస్తే స్వర్గానికి చేరుకోవచ్చునని, గోవు తనకు ఎవరూ తిండిపెట్టకపోయినా, గడ్డితిని, నీళ్లు తాగి అమృతం వంటి పాలను మనకిస్తోందని తెలుసు. ఒకనాడు గోమాత కన్నీరు కారుస్తోంటే, ఎందుకమ్మా! అని అడిగేడట ఒక భక్తుడు. "తన వల్ల అందరూ లబ్ధిపొందుతున్నారని, వ్యవసాయానికి ఆవు, ఎద్దులు ఎంతో ఉపయోగమనీ, గ్రామీణాభివృద్ధి దాని సంతతితోనే సాధ్యమని, తానిచ్చే పాలు, పెరుగు, వెన్న, మూత్రం, గోమయం అన్ని ఔషధాలేనని, తను మరణించిన తర్వాత కూడా తన చర్మంతోనో, కొమ్ముతోనూ, గిట్టలతోనూ అనేక విధాలుగా సొమ్ము చేసుకుంటున్నారని - అన్నింటిని ఉపయోగించుకుని తనను చంపి ఒకేసారి సొమ్ము-చేసుకుంటున్నారని, అలా నన్ను, చంపకండి మొర్రో - అని ఆవు విలపించడం లేదట. మరేమిటీ విలాపం? ప్రపంచానికే తల్లి కాబట్టి, తన సంతానమైన యావత్