
GOD FATHER
₹200
In stock · 5 available
PublisherK.V.V.S.MURTHY
LanguageTelugu
'గాడ్ ఫాదర్' తెలుగు అనుసృజన మొదటి ప్రతులన్నీ చెల్లిపోయి రెండవ ముద్రణకి నాలుగు నెలలో చేరుకోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించే అంశం! మేరియో ప్యూజో ఆంగ్లంలో రాసిన ఈ నవలకి గల ప్రాచుర్యం అందరికీ తెలిసినదే! అయితే ఇంతకాలంగా ఇది తెలుగు పాఠకులకు పరిచయం కాకపోవడం కొంత ఆశ్చర్యమే! అయితే మూర్తిగారి పుణ్యమా అని దీన్ని ఇప్పటికి తెలుగులో చదువగలుగుతున్నాం! సంతోషం. ఆస్ట్రాల్ ఒక మాఫియా కుటుంబ నేపధ్యానికి ప్రాధాన్యతనిస్తూ రాసిన నవలకి ఇంత ప్రాచుర్యమా... అని ఎవరైనా ప్రశ్నించ వచ్చు గాక! కాని చాలా క్లాసిక్ రచనల్లో లేని అసాధారణ శిల్పం 'గాడ్ ఫాదర్' సొంతం!... జీవన వైఫల్యాలు, మానవ విలువలు, రాగద్వేషాలు, మనో వల్మీకంలో గూడు కట్టుకున్న వినబడని రాగాలు, కనిపించని దృశ్యాలు సాధారణ పాఠకుడిని సైతం ముప్పిరిగొంటాయి. ఈ మూర్తిగారి స్ఫూర్తి యేమో గాని ఒక క్లాసిక్ స్థాయి గ్రంథాన్ని అనువాదానికి ఎంచుకోవడం చాలా గొప్ప విషయం. మహామహులైన అనువాదకుల గ్రంథాలతో పరిచయం, ద్విభాషాజ్ఞానం, అన్నిటికి మించి విశేష సాహితీ పాటవం ంటే తప్ప ఇది సాధ్యపడదు. 'గాఢ్ఫాదర్' తెలుగులోకి తీసుకురావడం ఒక సాహసం! అయినా ఆ సాహసం చేసి కృతకృత్యులు కావడం మూర్తిగారికే చెల్లింది.