GODARI KERATALU by PANASAKARLA PRAKASH NANEELU Telugu book cover

GODARI KERATALU

by PANASAKARLA PRAKASH NANEELU

₹30
In stock · 2 available
PublisherPANASAKARLA PRAKASH NANEELU
LanguageTelugu
నానీ మనసులో... ప్రయాణించే రహదారిలో మైలురాళ్ళను లెక్కించుకుంటాం. జీవిత ప్రమాణంలో కొట్టుకుపోతూ.. వయసు ప్రవాహాన్ని మాత్రం లెక్కించం. అలా లెక్కించని నా సాహితీ ప్రయాణం మొదలు పెట్టి అప్పుడే తొమ్మిదేళ్లు. వెనక్కి తిరిగి వయసును నూరుకోలేం జ్ఞాపకాలను తప్ప. ఆ జ్ఞాపకాలలో అపురూపమైన జ్ఞాపకం నా గురువుగారు తుమ్మిడి నాగభూషణం గారు. భీమవరంలో అస్త్రం సాయంకాల దిన పత్రికలో అచ్చైన నాకవితల్ని చూసి, శ్రీ వాగభూషణం గారు ఒక రోజు నన్ను ఆయనింటికి రమ్మన్నారు. గతంలో నేను రాసిన పాటలు కూడా విని నువ్వు ' ఇక్కడ కాదు హైదరాబాద్లో ఉండాలి, అక్కడ నీకు మంచి భషుత్తు ఉంటుంది' అని నన్నెంతో ఉత్సాహపరిచారు. ఆ తర్వాత నా తల్లిదండ్రులను ఒప్పించి నన్ను హైదరాబాద్ తీసుకువస్తూ.. ఆయన పట్టుకున్న నాచేయి, ఇంకా జ్ఞాపకాల చేతుల్లోనే ఉంది. ఐన వాళ్ళు కూడా పట్టించుకోని ఈ కాలంలో నాకు దారి చూపించిన దేవుడు నా గురువు నాగభూషణం గారు. ఇప్పటికీ ఆయన చూపించిన వారిలోనే ముందుకు సాగుతున్నాను. ఎప్పడో ఆయన పరిచయం చేసిన ఆ నాలుగు చేతులలోనే ఇప్పటికీ ఎంతో చేయూతను పొందుతున్నాను. అనుక్షణం నాకోసం తపించి, నిమిషంలో కూడా ఈ నాని గాడి గురించి ఆలోచించిన శ్రీ నాగభూషణం గారి పవిత్ర హృదయానికి నేను రాసిన గోదారి కెరటాలు (నానీలను) అంకితమిస్తున్నాను... లి ఘటిస్తూ....! నన్నెంతో ప్రేమించిన నాగురువు, అంతే ప్రేమగా ఆదరించిన వారి కుటుంబసభ్యులకు నేనెప్పుడూ ఋణపడి ఉంటాను. 2002 సం॥ భీమవరంలో మా గురువుగారు శ్రీ తుమ్మిడి నాగభూషణం రాసిన అమ్మిడి నానీలు పుస్తకాన్ని ఆచార్య ఎన్.గోపిగారు ఆవిష్కరించారు. అప్పుడు నిర్వహించిన కవితల పోటీలో శ్రీ గోపిగారి చేతుల మీదుగా మొదటి బహుమతి అందుకున్నాను. అప్పటి వరకూ కవితలు, పాటలు రాసే నేను ఆయన కరస్పర్శతో నానీల వాడినయ్యాను. అదే సంవత్సరం హైదరాబాదు రవీంద్రభారతిలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా|| సి. నారాయణ చెడ్డి గారు నిర్వహించిన రచయితల అధ్యయన శిబిరానికి పశ్చిమ గోదావరి జిల్లానుండి అర్హత సాధించడం అక్కడ మళ్ళీ గోపిగారిని కలవడం జరిగాయి.